Weather Update: రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు కురిసే అవకాశం..
వాన కాలం సీజన్ ముగిస్తున్నా.. వర్షాలు ఆగడం లేదు. ఈ సీజన్ లో రాష్ట్రంలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు అయింది. తెలంగాణలో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
వర్షాలకు ముందు.. వర్షాల తర్వాత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హనుమకొండ, కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో పలు చోట్లు భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎల్కతుర్తిలో 51 మిల్లిమీటర్లు.. కొండాపూర్‌లో 45 మి.మీ, కల్వకుర్తిలో 34 మి.మీ, తెల్కపల్లి లో 33, జూనూతలలో 33 మి.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, గన్నేరువరం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

గురువారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. మోతినగర్, బోరబండ, మాదాపూర్, అమీర్ పేట, ఎస్సాఆర్ నగర్ లో తేలికపాటి వర్షం కురిసింది. అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనతో రానున్న నాలుగు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందన అంచనా వేసింది. ఇది అక్టోబర్ 13 నుంచి 15 మధ్య వాయు గుండంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications