రేవంత్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చిన మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు!

హైదరాబాద్లో హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చి చెరువుల ఎఫ్ టి ఎల్ పరిధిలోను, బఫర్ జోన్ లలోనూ, అలాగే ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చివేతలకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ మూసి ప్రక్షాళనకు రెడీ అయిన విషయం తెలిసిందే. మూసి సుందరీకరణ పేరుతో మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్న పలు కాలనీలలో ఇండ్లు కూల్చివేయడం కోసం సర్వే కూడా నిర్వహించారు.

మూసీ రివర్ బెడ్ లో 16 వేల నిర్మాణాల తొలగింపుకు నిర్ణయం
ఈ సర్వేలో దాదాపు 16 వేల నిర్మాణాలు మూసి రివర్ బెడ్ లో సర్వే ద్వారా గుర్తించామని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవల వెల్లడించారు. అంతేకాదు ఈ నిర్మాణాలను తొలగించడానికి కార్యచరణ కూడా రూపకల్పన చేసినట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు.

The people of Musi catchment area gave an unexpected shock to Revanth reddy govt

మూసీ పరీవాహక ప్రాంతాల్లో భూసేకరణ అప్పుడే
మూసి పరివాహక ప్రాంత ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించి పునరావాసం కల్పించిన తర్వాతనే నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని కూడా మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. బఫర్ జోన్ కు సంబంధించిన భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత చట్టప్రకారం నష్టపరిహారం ఇచ్చిన తరువాతనే భూసేకరణ ప్రారంభిస్తామని వారు వెల్లడించారు.

రేవంత్ ప్రభుత్వానికి షాక్
మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఎవరూ ఎటువంటి అపోహలకు గురికా వద్దని అర్హులందరికీ కచ్చితంగా పునరావాసం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు.అయినప్పటికీ ఈ క్రమంలో మూసి పరివాహక ప్రాంత ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తమ ఇల్లు కూల్చవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పదేపదే విజ్ఞప్తి చేసిన మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్న మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు
ఫైనల్ గా మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు పలువురు స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, సత్యా నగర్, ఫణిగిరి కాలనీ, కొత్తపేటలో దాదాపు 100 ఇళ్ళ యజమానులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మూసి సుందరీకరణకు తమ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని తమ ఇళ్ళ కోసం న్యాయపోరాటం చేయడానికి కూడా తాము వెనకాడేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. వారు తెచ్చుకున్న స్టే ఆర్డర్ లను ఇళ్ళ ముందు అతికించి మరీ రేవంత్ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వెనక్కు తగ్గాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+