Shirisha: వీడని శిరీష మృతి మిస్టరీ.. ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ..

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ లో శనివారం అర్ధరాత్రి శిరీష అనే పారా మెడికల్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదటగా దీన్ని అత్యాచారం, హత్యగా భావించారు. తర్వాత అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిరీష మృత కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి.

మొదటగా బావ అనిలే అత్యాచారం చేసి హత్య చేశాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మృతి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో పోలీసులు సీరియస్ తీసుకుని కేసును విచారిస్తున్నారు. ముఖ్యంగా శిరీష కాల్ డేటా ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది. శిరీష ఎవరితో ఫోన్లో మాట్లాడింది. అనేదానిపై విచారణ చేస్తున్నారు.

 sirisha

సోమవారం బావ అనిల్, అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసలు ప్రశ్నించారు. మరోవైపు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటి రెడ్డి శిరీష మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత శిరీష ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శనివారం రాత్రి ఏం జరిగిందో శిరీష తండ్రి జంగయ్యను అడిగి తెలుసుకున్నారు. మొబైల్ విషయం గొడవ ఎందుకు వచ్చింది, బావ అనిల్ శిరీషను ఎందుకు కొట్టాడో జంగయ్యను ప్రశ్నించారు.

గొడవ అనంతరం శిరీష ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో రాత్రికి బయటకు వెళ్లినట్లు చెప్పారు. అయితే శరీష మృతదేహంపై గాయాలున్నాయని.. హత్య జరిగిందా, ఆత్మహత్య జరిగిందా స్పష్టం తెలియడం లేదన్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.

శిరీష సెల్ ఫోన్ ను సైబర్ క్రైమ్ బ్రాంచ్ కు పంపించామని తెలిపారు. ఈ అనుమానాస్పద మృతి కేసును త్వరలోనే చేధిస్తామని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. మరోవైపుపోస్ట్ మార్టం చేసిన డాక్టర్ శిరీష ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+