వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Teachers Transfers: శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం..

శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్, మార్గదర్శకాలు విద్యా శాఖ విడుదల చేసింది. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ 37 రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పుడు బదిలీ అయిన, ప్రమోషన్ పొందిన టీచర్లు ఈ విద్యా సంవత్సరం చివరి రోజున రిలీవ్ కావాల్సి ఉంటుంది. బదిలీలు, పదోన్నతులు
వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహిస్తారు.

గైడ్ లైన్స్

గైడ్ లైన్స్

బదిలీకి కటాఫ్ తేదీ 01.02.2023గా నిర్ణయించారు. 1.02.2023 నాటికి ఒక పాఠశాలలో 2 సంవత్సరాల సర్వీస్ నిండిన వారు బదిలీ దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు అవుతారు. NCC ఆఫీసర్స్ కు మాత్రం మాన్యువల్ కౌన్సెలింగ్ ఉంటుంది.
01.02.2023 నాటికి ఒక పాఠశాలలో 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాలు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది.మూడు సంవత్సరలలోపు రిటైర్ అయ్యేవారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది.

50 సంవత్సరాలలోపు

50 సంవత్సరాలలోపు

50 సంవత్సరాలలోపు వయసు ఉండి బాలికల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది.బాలికల పాఠశాలలో మహిళలు ఎవరూ లేని సందర్భంలో 50 సంవత్సరాల వయసు నిండిన పురుష ఉపాధ్యాయులకు అనుమతి ఉంటుంది.
SSC పెర్ఫార్మెన్స్ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్ పరిగణలోకి తీసుకోరు. స్పౌజ్, అవివాహిత మహిళలకు 10 అదనపు పాయింట్లు ఉంటాయి.

మల్టీజోన్

మల్టీజోన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తింపు.OD ఉన్న సంఘాలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 అదనపు పాయింట్స్ ఉంటాయి. ప్రధానోపాధ్యాయులకు మల్టీజోన్ స్థాయిలో, ఇతర ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు, పదోన్నతులు జరుగుతాయి. మల్టీజోన్ స్థాయిలో డియస్ఈ చే నామినేట్ చేయబడిన జాయింట్ డైరెక్టర్ స్థాయి సీనియర్ అధికారి చైర్మన్ గా, ఆర్జేడీ సెక్రటరీగా, సంబంధిత డిఈఓ సభ్యునిగా కౌన్సెలింగ్ కమిటీ ఉంటుంది.

కలెక్టర్

కలెక్టర్

జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కలెక్టర్ చైర్మన్ గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్ గా, జడ్పీ సిఈఓ సభ్యునిగా, డీఈఓ సెక్రటరీగా కమిటీ ఉంటుంది. జిల్లా స్థాయిలో జడ్పీ, ఎంపి టీచర్లకు జడ్పీ చైర్పర్సన్ చైర్మన్ గా, కలెక్టర్ వైస్ చైర్మన్ గా, జాయింట్ కలెక్టర్ సిఈఓ సభ్యులు గా‌, డిఈఓ కార్యదర్శి గా కమిటీ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీలకు డిఈఓ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ బదిలీ అధికారిగా ఉంటారు.

English summary
The process of teacher transfers and promotions will begin in Telangana from tomorrow. In this regard, the schedule and guidelines have been released by the Education Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X