Telangana: ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తెలంగాణలో ఎప్పుడంటే..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అవుతున్నా.. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడంపై పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ప్రజా పాలన భాగంగా రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. మంత్రులు అప్పుడప్పుడు కొత్త రేషన్ కార్డుల ప్రకటన చేస్తున్నారు. తప్పా.. కార్డులు ఎప్పుడు ఇస్తారు అనేది ఇంత వరకు ప్రకటించలేదు.

దీంతో చాలా మంది రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీలో అలసత్వంగా ఉండడంతో చాలా మంది రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు వస్తాయని ఎదురు చూస్తున్న వారికి నిరీక్షణే మిగిలింది. కానీ ఏపీలో మాత్రం ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి నిర్ణయించారు.

The question remains as to when new ration cards will be issued in Telangana

డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులకు చేసుకోవడానికి అవకాశం కల్పించనుంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో సంబంధిత అధికారులు స్వీకరించనున్నారు. మార్పులు, చేర్పులు చేసిన కార్డులు, కొత్త కార్డులన్నింటినీ సంక్రాంతి పండుగ సందర్భంగా లబ్ధిదారులకు అందించనున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు, సభ్యుల తొలగింపు సంబంధించి 3,36,72000 దరఖాస్తులు పెండింగ్ లో తెలుస్తోంది.

తెలంగాణలో కూడా ఇదే స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక రైతు భరోసా పై కూడా రేవంత్ సర్కార్ త్వరలో నిర్ణయం తీసుకున్నారు. వాన కాలం ముగిసిన యాసంగి మొదలవుతున్నా.. రైతు భరోసా రాకపోవడం పై రైతులు ఆందోళనగా ఉన్నారు. మహిళలకు రూ.2500 గురించి చర్చనే జరగడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+