జడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

ఇటివల కుమురం భీం ఆసీఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ దిక్కార స్వరం వినించారు. ఆయనతోపాటు పలువురు అనుచరులు ఏకంగా జడ్పీ సమావేశాన్ని బహిష్కరించినట్టు సమాచారం. తన తమ్ముడు జడ్పి వైఎస్ చైర్మణ్ గా ఉన్న కొనేరు కృష్ణ ప్రభుత్వంలో ఉన్నా జిల్లాకు చెందిన మంత్రులు ఎవరు సహకరించలేదనే ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కుమురం భీం జిల్లా కు సిర్పూర్ చెందిన కోనేరు కోనప్ప తమ్ముడు జడ్పి వైస్ చైర్మణ్ అయిన కోనేరు క్రిష్ణ ఇటివల గిరిజనులపై దాడి చేశాడనే కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. నియోజకవర్గంలోని సర్సాల గ్రామంలో అటవీ అధికారులపై దాడులు చేయడంతో మహిళ ఎఫ్ఆర్ఓ తీవ్రంగా గాయపడింది. దీంతో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.దీంతో క్రిష్ణతోపాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు కావడంతో వారు జైలుకు వెళ్లి వచ్చారు. ఈ సంధర్బంలో క్రిష్ణ తన జడ్పీ వైస్ చైర్మణ్ పదవికి రాజీనామ కూడ చేశారు.

 The ruling TRS party MLA konappa boycotted the zp council meeting

అయితే ఈ విషయంలో స్థానిక జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తనకు సహకరించక పోవడంతో పాటు,ఆయనకు మంత్రిపదవి రావడానికి కారణమైన తననే పట్టించుకోకపోవడంతో ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కష్టకాలంలో ఉన్న కోనప్పను కనీసం పలకరించలేదనే ఆవేదనను ఆయన వ్యక్తపరిచాడు.దీంతో విషయాన్ని అదిష్టానాకి తీసుకెళ్లేందుకు జడ్పీ సమావేశాలకు హజరు కాకుండా ఉన్నారని తెలుస్తోంది. జిల్లాలో మంచి పేరున్న కోనప్ప పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మరి ఇతరుల పరిస్థితి ఎలా ఉంటుందనేది పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. మరి పార్టీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో అని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+