హైదరాబాద్‌లో ఈ రేసులో దూసుకెళ్తున్న కార్లు: సచిన్, రామ్‌చరణ్ సహా ప్రముఖులు
భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది.
హైదరాబాద్: భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫార్ములా వన్ తర్వాత అంతగా ఆదరణ దక్కించుకుంటున్న ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నగరంలో సందడిగా కొనసాగుతోంది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా ఈ రేసు కార్లు దూసుకుపోతున్నాయి.
వాయువేగంతో దూసుకెళుతున్న ఈ కార్లు
వివిధ దేశాల నుంచి వచ్చిన రేసర్లు వేగంగా కార్లలో దూసుకుపోతున్నారు. జాగ్వార్, నిస్సాన్, కప్రా, అవలాంచ్, మహింద్రా కార్లు ట్రాక్‌పై దుమ్ము రేపుతున్నాయి. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ రేసు కొనసాగుతుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్ ప్రారంభమైంది. మొత్తం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు రేస్‌లో పాల్గొంటున్నాయి. మరోవైపు, నగరంలో జరుగుతున్న ఫార్ములా ఈ రేసు చూసేందుకు దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తరలివస్తున్నారు.
హైదరాబాద్ ఈ రేసుకు సచిన్, రామ్ చరణ్ సహా హాజరైన ప్రముఖులు
ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్ వీక్షిస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు ప్రముఖ సినీ నటులు రామ్‌చరణ్ తేజ్, దుల్కర్ సల్మాన్, అఖిల్, రాజకీయ ప్రముఖులు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎంపీ రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్ హాజరయ్యారు. వాయువేగంతో వెళుతున్న కార్లను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. మరోవైపు, రేసర్లతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడుతున్నారు.
ఈ రేసుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు: కేటీఆర్
ఫార్ములా ఈ రేసుకు రెండో రోజు మంత్రి కేటీఆర్ తనయుడితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందం కలిగిస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తొలిరోజు రాలేకపోయానన్నారు. ఈ కార్లు దూసుకుపోతుంటే చూడటానికి బాగుందన్నారు. నగరంలోని యువత, మోటార్ స్పోర్ట్స్ ఔత్సాహికులు రేసును వీక్షించేందుకు వస్తున్నారని తెలిపారు. ఈ ఈవెంట్ హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు కేటీఆర్. రేస్ కారణంగా నగరవాసులకు కొంత అసౌకర్యం కలుగుతున్న విషయం వాస్తమేనని.. అయితే, ఓపికతో మన్నించి సహకరిస్తున్నందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత ఈ-వెహికిల్ అమ్మకాలు పెరుగుతాయన్నారు.
దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్
ఫార్ములా ఈ రేసును వీక్షేంచేందుకు ప్రేక్షకుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 21వేల మంది చూసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. రేస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, మింట్ కంపౌండ్, తెలుగుతల్లి ఫ్లైవర్ పరిసర ప్రాంతాల రహదారులను పూర్తిగా మూసివేశారు. 17 ప్రాంతాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. 300 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 270 మంది ట్రాఫిక్ పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. మరో 600 మంది పోలీసులతో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భాగంగా భారత్ కు రావడం సంతోషంగా ఉందని ఎఫ్ఐఈ అధ్యక్షుడు మహమ్మద్ సులేమాన్ తెలిపారు. భారత్‌లో ఈ స్పోర్ట్ హై లెవల్‌లో ఉందని, రేసింగ్ నిర్వహించేందుకు భారత్ లో మరికొన్ని ట్రాక్ లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ఎఫ్ఐఏ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సత్ససంబంధాలను కొనసాగిస్తామన్నారు. భారత్ నుంచి కూడా రేసర్లకు మంచి అవకాశాలున్నాయని సులేమాన్ తెలిపారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications