బీఆర్ఎస్ అభ్యర్థుల రెండో జాబితా రెడీ.. త్వరలోనే వెల్లడి!!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కీలక రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తూ బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క అడుగు ముందుకు వేసి వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. అందులో కొన్ని స్థానాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు కొత్తవారికి అవకాశం ఇచ్చారు. మరి కొన్ని స్థానాలు పెండింగ్ పెట్టారు. ఇక తాజాగా పెండింగ్లో ఉన్న మిగతా స్థానాల అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది.

బీ ఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పెండింగ్ అభ్యర్థులతో త్వరలోనే రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇక ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు ప్రారంభించిన నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలోనూ, బిజెపి లోను ఉన్న అసమ్మతి నేతలను ఎన్నికల సమయానికి కారు ఎక్కించాలని సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. గత నెల 21వ తేదీన రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. మల్కాజ్ గిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి మరోమారు అవకాశం ఇచ్చింది.
అయితే మైనంపల్లి హనుమంతరావు తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని, ఎంపిక చేయడంతో పాటు, మరి కొన్ని స్థానాలలో కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. బీ ఆర్ఎస్ పార్టీ నుంచి జనగామ అభ్యర్థిగా రాజేశ్వర్ రెడ్డి , నర్సాపూర్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్ బిలాల్ పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఇక నాంపల్లి నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు కేసీఆర్. ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు వేస్తున్న ఎత్తుగడలు ఆయనకు మంచి ఫలితాలను ఇస్తాయా? మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెడతాయా? అనేది వేచి చూడాలి.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications