తెలంగాణలో మయోనైజ్‌పై నిషేధం: ఎందుకంటే?
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్షయం తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
తెలంగాణలో హోటళ్లు, ఫుడ్ స్టాళ్లలో తరచూ తనిఖీలు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 3 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు, 5 మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మయోనైజ్ కల్తీ ఆహారం తీసుకుని పలువురు అనారోగ్యానికి గురికావడంతోపాటు ఒకరు మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మయోనైజ్ ను ఎక్కువగా.. మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండివిచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినా హోటళ్లు తీరు మార్చుకోవడం లేదని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది. ఈ క్రమంలో సమీక్ష జరిపిన అనంతరం మయోనైజ్‌పై నిషేధం విధించారు.
మయోనైజ్ తీసుకోవడం వల్ల ఇటీవల కాలంలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్‌లోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరిశంకర్ కాలనీలలో గత శుక్రవారం సంత జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఢిల్లా హాట్ మోమోస్ స్టాల్‌లో విక్రయించిన మాంసాహార మోమోస్, వాటితోపాటు ఇచ్చిన మయోనైజ్, చట్నీని బస్తీకి చెందిన రేష్మబేగం, ఆమె పిల్లలు రుమ్షా, రఫియా తిన్నారు. అదేరోజు రాత్రి ఈ ముగ్గురికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి.
Prohibition on Mayonnaise made from raw eggs
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) October 30, 2024
The prohibition applies to Mayonnaise being prepared by FBOs for commercial use, using raw eggs without any pasteurisation.
The ban does not apply to mayonnaise which is produced from pasteurised eggs, with due safety measures to… pic.twitter.com/dYL8igLDvu
పిల్లలిద్దరినీ ఆస్పత్రిలో చేర్చగా.. తల్లి ఇంట్లోనే ఉంది. ఆదివారం రేష్మబేగం (31) పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అల్వాల్‌లోని గ్రిల్ హౌజ్ హోటల్‌లో నాసిరకం మయోనైజ్ ను తిన్న కొందరు యువకులు ఆస్పత్రి పాలయ్యారు. ఇలాంటి ఘటనలు ఇటీవల వరుసగా చోటు చేసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం మయోనైజ్‌పై నిసేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications