వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్నల్ సంతోష్ బాబు విగ్రహం సిద్ధం ..సైనిక యూనీఫాంలో ... తెలంగాణా తెలుగు తేజం

|
Google Oneindia TeluguNews

ఇండియా చైనా సరిహద్దు ఘర్షణలో అమరుడైన వీరుడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహం శరవేగంగా ముస్తాబవుతోంది. తెలంగాణ తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరం కి చెందిన శిల్పులు తయారు చేస్తున్నారు.

కల్నల్ సంతోష్ బాబు గౌరవార్ధమే నిర్ణయం

కల్నల్ సంతోష్ బాబు గౌరవార్ధమే నిర్ణయం


దేశం కోసం ప్రాణ త్యాగం చేసినా అమరుడు కల్నల్ సంతోష్ బాబు గౌరవార్ధం ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈనెల 15వ తేదీన తూర్పు లడఖ్ లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో భారత సైనికులతో చైనా సైనికులకు జరిగిన ఘర్షణల్లో భాగంగా ఇరవై మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో తెలంగాణకు చెందిన తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబు కూడా వీర మరణం పొందారు.

సంతోష్ కుటుంబానికి అండగా ఉన్న ప్రభుత్వం .. ఆయన జ్ఞాపకార్ధం విగ్రహ ఏర్పాటు

సంతోష్ కుటుంబానికి అండగా ఉన్న ప్రభుత్వం .. ఆయన జ్ఞాపకార్ధం విగ్రహ ఏర్పాటు

ఇక ఆయన త్యాగాలకు గానూ మన తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది. ఏకంగా సీఎం కెసిఆర్ సూర్యాపేట వెళ్లి సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున ప్రకటించిన 5 కోట్ల రూపాయల నగదును, కల్నల్ సంతోష్ భార్యకు గ్రూప్ వన్ అధికారిణిగా ఉద్యోగాన్ని, అలాగే బంజార హిల్స్ ప్రాంతంలో 711 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. ఎప్పుడు అవసరం వచ్చినా తన దగ్గరకు రావాలని పేర్కొన్నారు. అంతేకాకుండా సంతోష్ బాబు జ్ఞాపకార్థం విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఏపీలో శరవేగంగా సాగుతున్న విగ్రహ తయారీ పనులు

ఏపీలో శరవేగంగా సాగుతున్న విగ్రహ తయారీ పనులు

ఇక ఈ నేపథ్యంలోనే శరవేగంగా ఆయన విగ్రహ తయారీ పనులు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం శిల్పులు విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇక ఈ వారం రోజులలోపే సూర్యాపేటకు కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని పంపించనున్నారు. ఈ వీర సైనికుడి విగ్రహాన్ని సూర్యాపేట పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సంతోష్ బాబు విగ్రహం సూర్యాపేటకు చేరుకున్న తర్వాత తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లు జరుగుతాయి.

 సైనిక యూనీఫాంలో దేశభక్తి కలిగేలా విగ్రహ తయారీ

సైనిక యూనీఫాంలో దేశభక్తి కలిగేలా విగ్రహ తయారీ

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుడు సంతోష్ బాబు జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండాలని,సూర్యాపేట వాసులు ఎప్పుడు గుర్తుంచుకునేలా ఉండాలి అని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. అచ్చం సంతోష్ బాబును అచ్చు గుద్దినట్టే ఆయన విగ్రహం జీవకళతో ఉట్టిపడుతుంది. సైనిక యూనీఫాంలో సంతోష్ బాబు విగ్రహాన్ని దేశభక్తికి , జాతీయ భావానికి ప్రతీకగా తయారు చేస్తుండటం గమనార్హం .

English summary
A memorial statue would be set up at Suryapet in memory of the Colonel santhosh babu who was killed by Chinese troops during clashes in Galwan Valley in Ladakh. the statue is almost ready to set up in suryapet . In west godavari district the statue is in final touch ups . It will be completed and reached in a week to suryapet .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X