Rythu Bharosa: రైతు భరోసా కోసం కేబినెట్ సబ్ కమిటీ..
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించనున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాక మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సభ్యులుగా ఉన్నారు. సబ్ కమిటీ రైతు భరోసా విధివిధానాలను రూపొందించనుంది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం ఇచ్చేది. సంవత్సరానికి ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేవారు. అయితే ఈ పథకం వల్ల భూస్వాములు లాభపడ్డారు కానీ చిన్న రైతులు అంతగా లబ్ధి పొందలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా కేవలం అర్హులకు మాత్రమే చేరే విధంగా ఉండాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాకు రూ.15 వేలు అందించనుంది. ఈ పథకం అర్హులైన వారికి చేరే విధంగా విధివిధానాలు ఉండాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించారు.

రైతు భరోసా 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఇవ్వాలా లేదా.. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఇవ్వాలా.. లేక పీఎం కిసాన్ యోజన పథకం విధివిధానాలనే అనుసరించాలా అనేది కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించనుంది. మరోవైపు రైతు రుణ మాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రూ.2 లక్షల లోపు రైతు రుణ మాఫీ చేయడానికి ఇప్పటికే కేబినెట్ భేటీలో చర్చించారు. ఏక కాలంలోనే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు చేసిన రైతు రుణ మాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి ఉంటుందన్నారు. రుణమాఫీ వల్ల 32 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసే రాష్ట్రాన్ని దివాలా తీసినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు సాగతున్నారని ప్రశంసించారు












Click it and Unblock the Notifications