అవి పండ్లా, కార్బైడ్సా...పండ్లలో కార్బైడ్ వాడకంపై హైకోర్టు సీరియస్
కార్బైడ్ వాడకం పై తెలంగాణ హైకోర్టు సీరియస్, వాటి వాడకంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఆదేశం, ఉద్యోగులను సైతం నియమించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు సూచన, ఆహర భద్రత ఎదుర్కోంటున్న వాటిలో కార్బైడ్ సమస్య ఒకటని వ్యాఖ్య
మనం తినే పండ్లు ఎంత హనికరమైనవో అందరికి తెలుసు,అరటి పళ్లనుండి మొదలుకొని సీజనల్ గా వచ్చే మామిడి,ఇతర పండ్లను త్వరగా పండించేందుకు అందులో కార్బైడ్ ను ఉంచి మగ్గపెడతారు..మరోవైపు మర్కేట్ వచ్చిన తర్వాత వ్యాపారలు సైతం కార్బైడ్ ను వాడతారు, దీంతో పలు వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు వినియోగదారులు ,అయినా ప్రతి సీజన్ లో కార్బైడ్ వాడకం యధేఛ్చగా జరుగుతోంది..అయినా ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి.దీంతో హైకోర్టు జోక్యం చేసుకుంది.

కట్టడి చేయండి ప్రభుత్వానికి ఆదేశించిన కోర్టు
తాజగా కార్బైడ్ వినియోగం పై తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంది..దీని వాడకంపై చాల కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ,ఎవ్వరికి అందకుండా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని సూచించింది..ప్రస్థుతం ఆహర రంగం ఎదుర్కోంటున్న సవాళ్లలో కార్బైడ్ ఒకటని హైకోర్టు వ్యాఖ్యానించింది..

ఉద్యోగులను నియమించండి,
కార్బైడ్ వాడకంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టానలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఇందుకు సంబంధించిన ఉద్యోగులను సైతం నియమించాలని మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు సైతం సూచించింది..దీంతోపాటు కార్బైడ్ వాడకం పై నివేదిక సమర్పించాలంటూ వైద్యఆరోగ్య శాఖను ఆదేశించింది.

సుమోటో గా స్వీకరించిన హైకోర్టు ,
కాగా 2015 లో ఓ ప్రధాన పత్రిక లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో గా స్వీకరించి విచారణ చేపట్టింది.దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టీబిఎన్ రాధాకృష్ణన్ ,జస్టీస్ ఏ రాజశేఖర్ రెడ్డి ల ధర్మాసనం విచారించింది. పబ్లిక్ సర్వీసు కమీషన్ ఫుడ్ సెక్యూరిటి అధికారుల నియామకం చేపట్టామని ప్రస్థుతం ఉన్నపోస్టులకు గాను అదనంగా 36 కోత్త పోస్టులను క్రియోట్ చేశామని వారు తెలిపారు.కాగ మరిన్ని పోస్టులను సైతం క్రియోట్ చేయాలని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications