తెలంగాణా హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేడు 117 పిటీషన్ల విచారణ

నేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వేసిన అన్ని పిటీషన్ల విచారణ జరగనుంది. ఒకే సారి జరుగుతున్న ఈ విచారణ చరిత్ర సృష్టించనుంది. కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వందల కొద్దీ ఫిర్యాదులతో ఎన్నో పిటిషన్లు హైకోర్టుకు చేరాయి. వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించిన హైకోర్టు కాళేశ్వరానికి వ్యతిరేకంగా దాఖలైన 177 పిటిషన్లను నేడు విచారించనుంది.

The trial of 117 petitions on the Kaleshwaram project in Telangana High Court today

కాళేశ్వరం ముంపు పరిధిలోని కిష్టాపూర్ లో పనులు చేయరాదని గతంలో సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. కిష్టాపూర్ తో పాటు ఇప్పుడు పలు ఇతర గ్రామాల ప్రజలు కూడా పిటిషన్ లలో భాగం అయ్యారు. కిష్టాపూర్ పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అపీల్ చేయగా, దానిపైనా నేడు విచారణ జరగనుంది. అలాగే రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని దాఖలైన పిటిషన్లే ఇందులో అధికంగా ఉన్నాయి. మరి నేడు ధర్మాసనం ముందుకు విచారణకు వస్తున్న ఈ పిటీషన్ల విషయంలో హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+