TSRTC: తెలంగాణ ఆర్టీసీపై పాట విడుదల.. పాడింది ఎవరంటే..!
తెలంగాణ ఆర్టీసీపై ఓ పాటను ఆవిష్కరించింది ఆ సంస్థ. హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లో 'తెలంగాణ ఆన్ ట్రాక్' పాట ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించి.. ఆర్టీసీపై రాము మిరియాల పాడిన పాటను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వి.సి.సజ్జనార్ కలిసి విడుదల చేశారు.

90 ఏళ్ల చరిత్ర
ఈ పాటకు సంబంధించి ప్రొమో కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్, యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఈ రోజు పూర్తి పాటను ఆవిష్కరించారు. ఆర్టీసీకి 90 ఏళ్ల చరిత్ర ఉందని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు, మేధావులు, అధికారులు ,బ్యూరో క్రాట్స్ ఎంతోమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని వివరించారు.

2 నెలల సమయం
కాగా ఈ పాటను రూపొందిచాడనికి 2 నెలల సమయం పట్టిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాం మిరియాల పాడిన ఈ సాంగ్ ద్వారా ప్రజల్లోకి ఆర్టీసీ మరింత బలంగా వెళ్తుందని వారు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సు గురించి ప్రజలకు తెలియజెప్పడమే 'తెలంగాణ ఆన్ ట్రాక్' సాంగ్ ఉద్దేశమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు.

ప్రైవేట్ రవాణా వ్యవస్థ పెరిగినా
ఆర్టీసీతో ప్రజలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని రామ్ మిరియాల ఈ పాట ద్వారా చెప్పడం గొప్ప విషయమన్నారని వివరించారు. ప్రైవేట్ రవాణా వ్యవస్థ పెరిగినా ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీతో ఉన్న బంధం గుర్తు చేసుకుని పాట రాశానని రామ్ మిరియాల తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణించి క్షేమంగా, భద్రంగా గమ్యం చేరుకోవాలని కోరుకున్నారు.

ఆర్టీసీ ఛార్జీలు
తెలంగాణలో చాలా వరకు బస్సు ప్రయాణం చేస్తారు. తెలంగాణలో ఎక్కువ రైల్వే కనెక్టివిటీ లేకపోవడంతో అందురూ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతులు చేపట్టిన నుంచి ఆ సంస్థల్లో అనే కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా కొద్ది నెలల క్రితం ఆర్టీసీ ఛార్జీలు పెంచింది.












Click it and Unblock the Notifications