నలుగురు పిల్లలను గుంజకు కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ .. అసలేం జరిగిందంటే

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలని కూడా చూడకుండా ఓ కిరణం షాపు యజమాని నలుగురు పిల్లలను తాళ్లతో కట్టేసి కొట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో కిరణా షాపు యజమాని చిన్నారులను తన దుకాణంలో నగదు చోరీ చేస్తున్నట్లుగా గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

The video of four children tied to a pole went viral on social media

అంత వరకు బాగానే ఉన్నా పిల్లలంతా మైనర్లు కాబట్టి మందలించి పంపించాల్సిందిబోయి నలుగురు పిల్లలను గుంజకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత దుకాణ యజమాని పిల్లల తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి తల్లిదండ్రులను పిలిపించి వారికి పిల్లలను అప్పగించారు . అయితే షాప్ ముందు పిల్లలు కట్టేసి ఉండడంతో కొందరు వీడియో తీసి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గుంజకు కట్టేసిన పిల్లల వ్యవాసు 12, 13 సంవత్సరాలు ఉంటుందని అంటున్నారు.

దీంతో మైనర్ బాలుర హక్కులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తప్పు చేస్తే మందలించాలి కానీ షాపు యజమాని, ఈ విధంగా ప్రవర్తించటం దారుణమని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు స్థానికుల నుండి వివరాలు తెలుసుకుంటున్నారు.
బాలలకు ప్రత్యేక హక్కులు ఉన్న నేపధ్యంలో బాలల హక్కుల సంఘాలు ఈ ఘటనపై ఎలా స్పందిస్తాయో చూడాలి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+