డబ్బు పంచలేదని ఓటు వేయబోమన్న గ్రామస్తులు .. అవాక్కైన అధికారులు .. ఇదేనా ఓటరు చైతన్యం

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తొలివిడత పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో ఊహించని విచిత్ర సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. . మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్తులు ఎన్నికల్లో ఓట్లు వెయ్యటానికి నిరాకరిస్తున్నారు. వారు ఓటు వెయ్యమని చెప్తుంది.. తమ సమస్యల పరిష్కారం కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్టే . వారు ఓట్లు వెయ్యకుండా అలగటానికి గల కారణం తెలిస్తే అవాక్కవ్వటం మీ వంతు అవుతుంది .

 ఎన్నికల్లో ఓటేసేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓట్లు వెయ్యమని అలిగిన గ్రామస్తులు

ఎన్నికల్లో ఓటేసేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓట్లు వెయ్యమని అలిగిన గ్రామస్తులు

అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు జరుగుతున్న ఎన్నికలకు గాను నిన్న రాత్రి చింత గూడ గ్రామంలో పోటీలో ఉన్న అభ్యర్థులు డబ్బులు పంచారు. ఓ పార్టీకి చెందిన నేతలు ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే డబ్బులు పంపిణీ చేశారని తెలుస్తోంది. దీంతో డబ్బులు అందని మరో వర్గం ప్రజలు నిరసనకు దిగారు. వారంతా ఓటు వేయడానికి నిరాకరించారు. మాకు డబ్బులు పంచనప్పుడు.. మేము ఓటు ఎందుకు వేయాలని నిలదీస్తున్నారు. డబ్బు ఇస్తేనే ఓటు వేస్తామని వారు తెగేసి చెబుతున్నారు.

మాకు డబ్బు ఎందుకు ఇవ్వలేదు మేం ఓటర్లం కాదా అని నిలదీస్తున్న వైనం

మాకు డబ్బు ఎందుకు ఇవ్వలేదు మేం ఓటర్లం కాదా అని నిలదీస్తున్న వైనం

డబ్బు ఎవరికి అందిందో వాళ్లే ఓట్లు వేస్తున్నారని చెబుతున్నారు. తమకు డబ్బు ఇవ్వకపోవడాన్ని మహిళలు అవమానంగా ఫీల్ అవుతున్నారు.కొందరు మహిళలు ఏకంగా లోకల్ లీడర్లతో ఘర్షణకు దిగారు. మేము ఓటర్లం కాదా, మాకు ఓట్లు లేవా అని నిలదీస్తున్నారు . మాకు డబ్బు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు .డబ్బులు పంచలేదని చింతగూడ గ్రామస్తులు నిరసనకు దిగడం, డబ్బు పంచిన నేపధ్యంలో డబ్బు అందిన వారు మాత్రమే ఓటు వేస్తున్నట్టు ప్రచారం జరగడం చర్చనీయాంశంగా మారింది.

గ్రామస్తుల తీరుతో అవాక్కవుతున్న అధికారులు .. ఇదేనా ఓటరు చైతన్యం

గ్రామస్తుల తీరుతో అవాక్కవుతున్న అధికారులు .. ఇదేనా ఓటరు చైతన్యం

గ్రామస్తుల తీరుతో అటు ఎన్నికల అధికారులు సైతం అవాక్కవుతున్నారు. ఓటు మన హక్కు.. మన ఆయుధం . దానిని నోటు కోసం అమ్ముకోకండి .. సమర్ధులైన నాయకులను ఎన్నుకోండి అని ఎంత చెప్పినా అవేవీ ప్రజలు పట్టించుకోవటం లేదు అని చెప్పటానికి ఈ సంఘటనే ఉదాహరణ. అధికార యంత్రాంగం ఎంత చైతన్యవంతులను చెయ్యాలని ప్రయత్నం చేసినా ఓటరు మాత్రం ప్రలోభాలకు లొంగి తన ఓటును నోటుకు అమ్ముకుంటూనే ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+