విజయశాంతి ఇంట్లో చోరీ: అది పనిమనిషి చేసిందే

హైదరాబాద్: తెలంగాణ రాములమ్మ, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గల విజయశాంతి ఇంట్లో బంగారు నగలు చోరీ అయ్యాయి. విజయశాంతి తన బంగారు నగల చోరీపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. విజయశాంతి బంగారు నగలు చోరీ కావడం సినిమా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తరఫున గతంలో పార్లమెంటుకు ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కాంగ్రెసు పార్టీలో ఉన్నారు.

vijaya santhi

విజయశాంతి ఇంట్లో పనిమనిషే చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న విజయశాంతి ఇంట్లో ఐదురోజుల క్రితం డైమండ్స్ పొదిగిన చెవిదిద్దులు, ఉంగరం, గాజులు మాయమయ్యాయి. పోలీసులు వారి స్టైల్లో విచారించే సరికి అసలు విషయం బయటపడింది.

ఇదిలావుంటే, తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలుపడ్డారు. వారు రూ.70 వేల నగదుతో పాటు ఐదు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన హైదరాబాదు నగరంలోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారంనాడు వెలుగు చూసింది.

స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి రెండు రోజల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారంనాడు వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న నగదుతో పాటు బంగారు ఆభరణాలను కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+