Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫామ్‌హౌస్‌లో బాలికను రేప్ చేసిన దొంగలు: టెక్కీ, మృతి, రింగ్‌రోడ్డుపై దోపిడీ

హైదరాబాద్‌: హైదరాబాదులోని గండిపేటలో ఓ ఫాంహౌస్‌లో దొంగలు దారుణానికి ఒడిగట్టారు. చోరీకి పాల్పడడంతో పాటు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైన బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఫాంహౌస్ లో ఉన్న రెండు ల్యాప్‌టాప్‌లతో దొంగలు పరారయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో టెక్కీ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం సికింద్రాబాదులోని అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అల్వాల్‌లోని టీచర్స్‌ కాలనీ ప్రాంతానికి చెందిన మణి (29) గూగుల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యో గిగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి ఉద్యో గానికి వెళ్లిన మణి శుక్రవారం తెల్లవారు జా మున బోయినపల్లి డెయిరీ ఫామ్‌ నుంచి ఖానాజీగూడ మీదుగా టెలికమ్‌ కాలనీకి వస్తున్నాడు.

ఈ సమయంలో ఖానాజీగూడ వద్ద సంతోష్‌ ట్రావెల్స్‌ వాహనం మణి బైక్‌ను ఢీకొనడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అల్వాల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమో దు చేసి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Theives rapes a girl in a farmhouse at Gandipet

భార్యాభర్తల తోపులాటలో భర్త మృతి

భార్యాభర్తల తోపులాటలో భర్త మృతి చెందాడు. ఈ సంఘటన సికింద్రాబాదులోని తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. లాల్‌బజార్‌ శాసి్త్రనగర్‌కు చెందిన భార్గవి, రాజ్‌కుమార్‌ భార్యాభర్తలు. రాజ్‌కుమార్‌ స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

గురువారం రాత్రి భార్గ వి, రాజ్‌కుమార్‌లు గొడవ పడ్డారు. భార్య భార్గవిని రాజ్‌కుమార్‌ చితకబాదాడు. దాంతో రాజ్‌కుమార్‌ను ఆమె నెట్టిసింది. రాజ్‌కుమార్‌ గోడకు పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రింగ్‌రోడ్డుపై పట్టపగలు దోపిడీ...

పట్టపగలు హైదరాబాదు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై దారి దోపిడీ జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ రాష్ట్రం ఖడతగహన్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ లియాఖత్ పశువుల వ్యాపారం చేస్తుంటాడు. 10వ తేదీన జహీరా బాద్‌, కంకోల్‌ పశువుల సంతలో రూ.14 లక్షలు వెచ్చించి 13 జతల ఎడ్లను కొనుగోలుచేసి ట్రక్కులో ఆంధ్రప్రదేశ్‌లోని సర్పంపేట్‌ మార్కెటకు తరలిస్తున్నారు.

మండల పరిధిలోని హామీదుల్లానగర్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్దకు రాగనే మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని 8 మంది బోలేరా వాహనంలో వచ్చి ట్రక్కును అడ్డగించా రు. ఇద్దరు డ్రైవర్లు, కూలీలపై హకీ కర్రలతో దాడిచేసి గాయపర్చి ఎడ్లతో పాటు డ్రైవర్‌ వద్ద ఉన్న 48 వేల నగదుతో పరారయ్యారు.

ఈ విషయాన్ని వారు యజమాని మహ్మద్‌ లియాఖతకు ఫోన్‌లో తెలిపారు. దీంతో మరుస టి రోజు శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విషయమై సీఐ ఉమామహేశ్వర్‌ను విలేకరులు శుక్రవారం వివరణ కోరగా ఫిర్యాదు అందిందనీ తెలిపారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ఆటో డ్రైవర్ ఆత్మహత్య

సికింద్రాబాదులోని తుకారాంగేట్‌ పీఎస్‌ పరిధిలో ఆటో డ్రైవర్ మహేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపురం పోలీసులు దొంగతనం చేశాడంటూ మహేష్ ను నిన్న పీఎస్‌కు తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు పెట్టిన చిత్రహింసలు భరించలేక పీఎస్‌ నుంచి పరారైన మహేష్ ఉరేసుకున్నాడని స్థానికులు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+