BJP: బీజేపీలోకి నగర కాంగ్రెస్ నేత..! అక్కడి నుంచే పోటీ..!
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీ అధినేత గట్టి నిఘా పెట్టడంతో.. కాషాయదళం హస్తం పార్టీ నేతలపై దృష్టి సారించింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి కమలం తీర్థం పుచ్చుకోగా.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ కీలక కాంగ్రెస్ నేత బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆ నేత ఇప్పటి వరకు స్పందించలేదు.

కొండా సురేఖ
అయితే కాంగ్రెస్ లో అర్గత కుమ్ములాటాలు, పార్టీని ఒంటి చేతితో నడిపించే నేతలు లేకపోవడంతో చాలా మంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. గ్రౌండ్ లెవల్ లో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ పై స్థాయిలో నేతల్లో సఖ్యత లేకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంది. రెండు రోజుల క్రితం టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు. టీపీసీసీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సురేఖ రాజీనామా చేశారు.

పి.జనార్ధన్ రెడ్డి
ఇలా చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. హస్తం పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలతో బీజేపీ నేతలు టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. తమ పార్టీలోకి రావాలని కోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా దివంగత పి.జనార్ధన్ రెడ్డి (PJR) తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కమల దళంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆయన బీజేపీలోకి వస్తే జూబ్లీహిల్స్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేలు, మంత్రులు
పీజేఆర్ కు నగరమంతా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ పార్టీల్లో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు బీజేఆర్ శిష్యులే. విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో బలం పెరుగుతుందని బీజేపీ అంచనా వేస్తుంది. కొద్ది నెలల క్రితం పీజేఆర్ కుమార్తె విజయ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆమె వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

బీఆర్ఎస్
బీఆర్ఎస్ లో కొంత మంది ఎమ్మెల్యేలు, నేతలు అసంతృప్తిగా ఉన్నా.. వారు వారిని సంప్రదించడం బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది. పార్టీ అధినేత ఎమ్మెల్యేలపై నిఘా ఉంచడంతో వారిని సంప్రదించడానికి వీలు పడడం లేదు. అయితే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ నుంచి వీలైనంత మందిని ఆకర్షించాలని బీజేపీ భావిస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!











Click it and Unblock the Notifications