Jaggareddy: కారు వైపు జగ్గారెడ్డి చూపు.. చేరిక ఖాయమేనా..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది రాజకీయ పరిణామాలు వేగంగా మారుతోన్నాయి. నేతలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు గోడలు దుక్కుతున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ లో చేరారు. ఆయన భద్రాచలం టికెట్ ఆసిస్తున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి చంద్రశేఖర్ కొద్ది రోజుల క్రితం బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటి వరకు పార్టీలు మారుతున్న వారంతా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.
అయితే తాజాగా కాంగ్రెస్ చెందిన ఓ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారశైలి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కారు ఎక్కెందుకు రెడీ అవుతున్నాట్లు ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డి గత కొంత కాలంగా గులాబీ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో చేరి సంగారెడ్డి నుంచే పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పార్టీ మార్పుపై జగ్గారెడ్డి ఇంకా స్పందించలేదు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నుంచి కాస్త అసంతృప్తిగా ఉన్నారు. పలు సందర్భాల్లో జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానికి కూడా లేఖలు రాశారు.
జగ్గారెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. కేటీఆర్ ను కలిసినప్పుడు జగ్గారెడ్డితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉన్నారు. మీ ఇద్దరి దోస్తాన్ ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడిగ్గా.. మాది ఒకే మంచం, ఒకే కంచం అంటూ మామిళ్ల చెప్పారు. అట్లయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా అన్న కేటీఆర్ అడగ్గా.. సగ్గారెడ్డిలో గెలిపించి బీఆర్ఎస్ లోకి తీసుకొస్తా మావిళ్ల రాజేందర్ సరదాగా అన్నారు. కానీ ఇప్పుడు నిజమయ్యే అవకాశం ఉంది. జగ్గారెడ్డి కాంగ్రెస్ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications