ఏపీలో కేసీఆర్, హరీష్ లాంటి నేతలు లేరు.. బాధపడ్తున్నా: జగన్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని వైసిపి నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. అందుకు తాను బాధపడుతున్నానని చెప్పారు.
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం కాజిపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాలవికాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొని, ప్రసంగించారు. సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదన్నారు. అందుకు తాను బాధపడుతున్నానని చెప్పారు.

ప్రజల సమస్యలను పట్టించుకుని వారికి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలవడం శుభపరిణామం అన్నారు. పాలనలో ఏపీకి తెలంగాణకు పొంతన లేదన్నారు. ఏపీలో అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయన్నారు.
పేదలను పట్టించుకునే పరిస్థితి ఏపీలో లేదని చెప్పారు. తెలంగాణలో మంత్రి హరీష్ రావు లాంటి నేత ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఏపీలో మీడియా మేనేజ్‌మెంట్ తప్ప సమస్యను పట్టించుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications