హైదరాబాద్‌లో ఇకనుంచి ట్రాఫిక్ ఉండదు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ గురించి మనం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరంలేదు. మాట్లాడాల్సిన అవసం లేదు. అందులోను వర్షం పడిందంటే ఎప్పుడు ఇంటికి వెళతామో ఎవరికీ తెలియదు. అర్థరాత్రికి లేదంటే తెల్లవారుజాముకు చేరుకుంటారు. మరోవైపు డ్రెయినేజీ సమస్య ఉంది. వర్షం కురిసినప్పుడు వర్షపునీరు, డ్రెయినేజీలు కవలపిల్లల్లా కలిసిపోతాయి. ఇటువంటి పరిస్థితిని అంచనా వేసుకుంటున్న కంపెనీలు హైదరాబాద్ రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి సరికొత్త ప్రణాళిక రచించారు
ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం
రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచుతారు. అలాగే ఎయిర్ కనెక్టివిటీ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. స్కైవాక్ లు, మోనో రైలు లాంటివి తీసుకురాబోతోంది. పర్యాటకులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలకు మెట్రోను పొడిగించడం, ఉద్యోగుల కార్యాలయాల వరకు స్కైవాక్ లను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే సైక్లింగ్ మార్గాలు కూడా సిద్ధమవుతున్నాయి. పీపీపీ పద్ధతిలో మోనో రైలు ప్రాజెక్టును తేబోతున్నారు. దీనివల్ల ఇంటి నుంచి కార్యాలయాలకు, కార్యాలయాల నుంచి ఇళ్లకు అనుసంధానం సులువుగా అవుతుంది. మోనో రైలును మెట్రోకు కలుపుతారు.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో
హైదరాబాద్ నగర మోడల్ ను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలుండేలా తీర్చిదిద్దుతున్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించడంతోపాటు సౌకర్యవంతమైన ఆధునిక ప్రయాణ పద్ధతిని అందుబాటులోకి తేబోతున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో చేపడతారు. దాదాపుగా సిద్ధమైన ఈ ప్లాన్ ను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ ఆమోదిచబోతున్నారు. మౌలిక సదుపాయాల దిశగా హైదరాబాద్ నగరం ప్రపంచంలోని అతి పెద్ద నగరాలకన్నా మిన్నగా ఉండాలని, దూసుకుపోవాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. హైదరాబాద్ నగరానికి రోజురోజుకు పెట్టుబడులు పెరగాలంటే మౌలిక సౌకర్యాల కల్పనే ప్రధానమని భావిస్తున్న రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications