కేంద్రమంత్రి కలకలం: మహాత్ముడికి బదులుగా వీర్ సావర్కర్‌కు జాతిపిత హోదా: బీజేపీ ప్లాన్ అదే
హైదరాబాద్: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. #Gandhi హ్యాష్‌ట్యాగ్‌తో వేల సంఖ్యలో ట్వీట్లు పోటెత్తాయి. రాజ్‌నాథ్ సింగ్ చేసిన కామెంట్ల వెనుక ఏదో కుట్ర ఉందని, చరిత్రను ధ్వంసం చేసే ప్రయత్నాలకు భారతీయ జనతా పార్టీ నాయకులు తెర తీశారనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.
Cyclone month: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: ఇంకో రౌండ్ వర్షాలకు రెడీగా ఉండాల్సిందే
చరిత్రను ధ్వంసం చేసే కుట్ర..
తప్పుడు చరిత్రను భవిష్యత్ తరానికి అందించడానికి బీజేపీ పెద్దలు కృషి చేస్తున్నట్లు కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినాయక్ దామోదర్ సావర్కర్.. పుస్తకాన్ని రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదం అయ్యాయి. వేలాదిమంది నెటిజన్లు, కాంగ్రెస్ సానుభూతిపరులు దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తోన్నారు సోషల్ మీడియా వేదికగా.
తప్పుడు చరిత్రను ముందుకు
అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ సైతం- రాజ్‌నాథ్ చేసిన కామెంట్లను తప్పు పట్టారు. తప్పుడు చరిత్రను పుట్టిస్తోందని మండిపడ్డారు. భారత్.. బ్రిటీషర్ల పాలనలో ఉన్న సమయంలో వీర్ సావర్కర్.. అండమాన్‌లోని కాలాపాని కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నప్పుడు.. క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారనడం సరికాదని రాజ్‌నాథ్ సింగ్ అన్నా
మెర్సీ పిటీషన్ దాఖలు వెనుక గాంధీ ఉన్నారనడంలో
మహాత్మాగాంధీ ఆదేశాలు, సూచనల మేరకే ఆయన ఈ మెర్సి పిటీషన్‌ను దాఖలు చేశారని చెప్పారు. బ్రిటీషర్లకు క్షమాభిక్ష పిటీషన్‌ను దాఖలు చేయాలంటూ మహాత్మాగాంధీ పదేపదే సూచించడం వల్లే వీర్ సావర్కర్ ఆ పని చేశారని అన్నారు. అహింసా పద్ధతుల్లో స్వాతంత్య్ర పోరాటం సాగించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ.. వీర్ సావర్కర్‌కు సూచించారని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను అసుదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు తప్పుడు చరిత్రను తెలియజేసే ప్రయత్నానికి రాజ్‌నాథ్ సింగ్ తెర తీశారని విమర్శించారు.
మహాత్ముడి స్థానంలో వీర్ సావర్కర్..
ఇది ఇలాగే కొనసాగితే- జాతిపిత హోదాలో మహాత్మాగాంధీ పేరును తొలగించి.. వీర్ సావర్కర్‌ను చేర్చుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ హత్యతో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వ్యక్తిని జాతిపితను చేస్తారని ఆరోపించారు. జస్టిస్ జీవన్‌లాల్ కపూర్ కమిటీ కూడా ఇదే తేల్చిందని చెప్పారు. బీజేపీ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలు.. జాతి మొత్తాన్నీ తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అన్నారు.
చరిత్రను గుర్తుచేసే ప్రయత్నం..
మొట్టమొదటి సారిగా వీర్ సావర్కర్ తన క్షమాభిక్ష పిటీషన్‌ను దాఖలు చేసింది 1911లో కాగా.. 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చాడని గుర్తు చేస్తున్నారు. దీనికి సాక్ష్యాధారంగా అప్పటి కొన్ని క్లిప్పింగులను నెటిజన్లు.. తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చరిత్రను తప్పుదారి పట్టించేవేనంటూ మండిపడుతున్నారు. బీజేపీ నేతలు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉందంటూ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఆరోపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.