వారికి రూ.75వేలు.. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ ల ఆర్థిక సాధికారత పైన దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం వారు గౌరవంగా జీవించడం కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తుంది. ట్రాన్స్ జెండర్ లకు గౌరవప్రదమైన జీవనం అందించడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి నూటికి నూరు శాతం సబ్సిడీతో రుణాలను ప్రకటించింది.
75వేల రూపాయలు వంద శాతం సబ్సిడీతో ఋణం
దీంతో వారు ఏవైనా చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది.సమాజంలో ట్రాన్స్ జెండర్ లు చాలామంది వారికి సరైన ఆదరణ లేక, ఉపాధి కల్పన లేక రైళ్లలో, బస్టాండ్ల వద్ద ప్రయాణికుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాక్టీస్ కు చెక్ పెట్టాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించడం కోసం 75 వేల రూపాయల వరకు రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది.

వీరికే అర్హత
2025- 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రుణానికి పూర్తిస్థాయిలో అంటే నూటికి నూరు శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఇది లబ్ధిదారులకు ఎంతో చేయూతను అందిస్తోంది. అయితే ప్రభుత్వం అందించే ఈ పథకానికి 18 ఏళ్ల నుండి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న ట్రాన్స్ జెండర్ లకు , ఏదైనా రంగంలో శిక్షణ పొంది సొంతంగా చిన్న వ్యాపారాలను ప్రారంభించాలి అనుకునే వారికి ఈ రుణాలు అందించబడతాయి.
గౌరవంగా బ్రతికే ఛాన్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం
తద్వారా వారు స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆసక్తికర అర్హులైన ట్రాన్స్ జెండర్ లు తమ దరఖాస్తులను అవసరమైన ధ్రువ పత్రాలతో నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోని సంబంధిత కార్యాలయంలో సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 31వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఈ దరఖాస్తు ఫారాన్ని www.wdsc. telangana.gov.in నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద లబ్ధి పొందే ట్రాన్స్ జెండర్ లు గౌరవంగా బ్రతకడానికి కావలసిన సహకారాన్ని పొందవచ్చు.












Click it and Unblock the Notifications