దొరికిన దొంగ: చోరీకి వచ్చి నిద్రపోయాడు

నిజామాబాద్: దొంగతనానికి వచ్చిన ఓ బాలుడు అక్కడే నిద్రపోవడంతో దొరికిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని రుద్రూర్‌లోజమాల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లో గ్రామానికే చెందిన బాలుడు (14) ఆదివారం తెల్లవారుజామున చోరికి వచ్చాడు.

ఇంటి వెనుక తలుపులను ధ్వంసం చేశాడు. తర్వాత ఇంట్లోని రూ.10వేలు, 5తులాల బంగారాన్ని దొంగింలించాడు. చోరీ చేసే క్రమంలో అలసిపోయి అక్కడే గాఢనిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున గమనించిన ఆ ఇంటి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్సై అంజయ్య వచ్చి బాలుడిని లేపి సొత్తు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. కాగా, అతడు గతంలో పాఠశాలలో మధ్యాహ్నభోజనం బియ్యాన్ని చోరీ చేసి జైలుకు వెళ్లాడు. ఇటీవల పోస్టాఫీస్‌లో ఉద్యోగిని నగదు, సెల్‌ఫోన్లు కెమెరాను దొంగిలించి జైలుకెళ్లి మూడురోజుల కిందటే వచ్చి మళ్లీ పట్టుబట్టాడని స్థానికులు చెప్పారు.

 A thief arrested in Nizamabad district

బైక్‌ను ఢీకొన్న కారు: 8మందికి గాయాలు

హైదరాబాద్: ఓ కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొనడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆదివారం మోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

అబ్దుల్లాపూర్‌మెట్ వైపు నుంచి హయత్‌నగర్ వైపు వెళుతున్న ఓ కారు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురితో పాటు బైక్‌పై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు వారిని కామినేని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+