రేపే చర్లపల్లి వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం- ఏపీలో హాల్ట్ స్టేషన్లు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు తీపి కబురు వినిపించింది. హైదరాబాద్ కు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మంజూరు చేసింది. ఇది వీక్లీ ఎక్స్ ప్రెస్. శుక్రవారం పట్టాలెక్కబోతోంది. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్, ఏపీలో హాల్ట్ స్టేషన్ల జాబితా విడుదల అయింది. నాలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేసే ఎక్స్ ప్రెస్ ఇది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

చర్లపల్లి నుంచి తిరువనంతపురం నార్త్ మధ్య ఈ కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. తిరువనంతపురం నార్త్ నుంచి శుక్రవారం (జనవరి 23) ఉదయం 10:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06308 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు సాయంత్రం 4:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇది ఇనాగ్యురల్ సర్వీస్. రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ నంబర్ 17041/17042 టైమ్ టేబుల్ త్వరలో వెల్లడిస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Thiruvananthapuram North to Charlapalli new Amrit Bharat Weekly Express Launch on 23 January

తిరువనంతపురం నార్త్ నుంచి బయలుదేరే ఇనాగ్యురల్ సర్వీస్.. వర్కల శివగిరి (11:23/11:26), కొల్లం (11:52/11:55), కరునాగపల్లి (12:20/12:23), కాయంకులం (12:40/12:43), మావెలికర (12:52/12:55), చెంగన్నూర్ (13:05/13:08), తిరువళ్ల (13:17/13:20), చంగనస్సేరి (13:30/13:33), కొట్టాయం (13:50/13:55), ఎర్నాకులం టౌన్ (14:55/15:00), ఆలువా (15:20/15:23), త్రిస్సూర్ (16:25/16:30), పాలక్కాడ్ (18:00/18:05) స్టేషన్లల్లో ఆగుతుంది.

తమిళనాడులో కోయంబత్తూరు (19:35/19:40), తిరుపూరు (20:25/20:30), ఈరోడ్ (21:20/21:30) వద్ద స్టాప్‌లు ఉంటాయి. సేలం (22:20/22:23), జోలార్‌పేట, (00:02/00:05), కాట్పాడి (01:10/01:15), తిరుత్తణి (02:17/02:20), రేణిగుంట (03:20/03:30), నెల్లూరు (05:43/05:45), ఒంగోలు (07:30/07:32), బాపట్ల (08:30/08:32), తెనాలి (09:38/09:40), గుంటూరు (10:20/10:30), సత్తెనపల్లి (11:23/11:25), మిర్యాలగూడ (12:48/12:50), నల్గొండ (13:23/13:25) లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+