నివసించేందుకు హైదరాబాదే బెస్ట్: రేసులో వెనుకబడిన ఢిల్లీ, ముంబై

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత్‌లో నివసించేందుకు అత్తుత్తమ నగరాల్లో జాబితాలోకి తాజాగా మరొ కొత్త నగరం వచ్చి చేరింది. ఢిల్లీ, ముంబై నగరాలకు ధీటుగా ఇప్పుడిప్పుడే ఆ నగరం పోటీ పడుతోంది. మెర్సర్ అనే గ్లోబల్ హ్యూమన్ రీసోర్సెస్ కన్సల్టింగ్ సంస్థ ఓ సర్వేని నిర్వహించింది.

సర్వే ప్రకారం 2016 సంవత్సరానికి గాను భారత్‌లో జీవించేందుకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాను విడుదల చేసింది. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, వైద్య, ఆరోగ్య పరిగణనలు, పాఠశాలలు మరియు విద్య, ప్రజా సేవలు, రవాణా, వినోదం, వినియోగ వస్తువులు, హౌసింగ్ తదితర అంశాలను తీసుకుని మొత్తం 440 పట్టణాల్లో ఈ సర్వేని నిర్వహించింది.

This City Has Beaten Delhi And Mumbai To Become The Best Indian City To Live In!

ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మొట్టమొదటి స్థానంలో నలవడం విశేషం. ప్రపంచంలో జీవించేందుకు అనువైన 230 పట్టణాలకు గాను హైదరాబాద్ 139వ ర్యాంక్‌ను సొంతం చేసుకుని ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పూణె నిలిచింది.

161 ర్యాంకుతో ఢిల్లీ మూడో స్థానంలో నిలవగా, 152 ర్యాంకతో ముంబై, 160 ర్యాంక్‌తో కోల్‌కత్తా 145 ర్యాంక్‌తో బెంగుళూతు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉద్యోగాలు పెరగడంతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగుళూరు పట్టణాలతో పోలిస్తే ఇంటి అద్దె కూడా చాలా తక్కువ ఉండటం హైదరాబాద్‌కు కలిసొచ్చిన అంశాలు.

మొత్తంగా చూస్తే రాష్ట్ర విభజన అనంతరం హైదారాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పకనే చెప్పాలి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the war of Delhi-Bombay, a different city altogether has bagged the label of best Indian city. Mercer, the global human resources consulting firm, has released its 18th annual Quality of Living Survey, listing 2016 city rankings of best places to live in.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి