ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు: అరవింద్ పరువు నిలువునా తీస్తున్న రైతులు!!

పసుపు బోర్డుకు కేంద్రం పంగనామం పెట్టటంపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. పసుపు బోర్డు.. మా ఎంపి గారు తెచ్చిన పసుపు బోర్డు అని పసుపు రంగు బోర్డుపై రాసి వినూత్న రీతిలో రైతులు నిరసన తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పసుపు రంగు ఫ్లెక్సీలు వేసి ఎంపీ ధర్మపురి అరవింద్ ను టార్గెట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వ్యవహారం ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఊహించని సమస్యను తెచ్చిపెట్టింది.

పసుపు బోర్డుకు పంగనామం
పార్లమెంటు ఎన్నికలలో ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దానం చేసిన బీజేపీ పెద్దలు, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. పసుపు బోర్డుకు పంగనామం పెట్టి బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటు వేదికగా పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనే లేదని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఈ ప్రకటనతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. పార్లమెంట్ వేదికగా పసుపు బోర్డు లేదని చెప్పడంపై కేంద్రం మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

This is the turmeric board brought by our MP: Farmers are defaming Arvind!!

అరవింద్ ను టార్గెట్ చేస్తున్న రైతులు
ఇక పసుపు బోర్డు తెచ్చి తీరుతానని తమతో ఓట్లు వేయించుకున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు రంగు ఫ్లెక్సీలను కట్టిన రైతులు, ఇది మా ఎంపి గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ వ్యంగ్యంగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు.

పసుపుబోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని ధర్మపురి అరవింద్ ఎన్నికల సమయంలో చెప్పారని, పసుపు బోర్డు తెచ్చి తీరుతానని ప్రతి ఒక్కరికి బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారని గుర్తు చేస్తున్న రైతులు, నాలుగున్నర సంవత్సరాలు గడిచినా పసుపు బోర్డు సాధించని ఎంపి అరవింద్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

పసుపు బోర్డుపై తగ్గేదే లేదంటున్న రైతులు
బిజెపి అగ్ర నేతలు రాజనాధ్ సింగ్, రామ్ మాధవ్ వంటి వారు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయని బిజెపి నాయకులకు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదంటున్నారు రైతులు.

అన్నదాతలను మోసం చేసిన ఎంపి అరవింద్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్న రైతులు, పసుపు బోర్డు కోసం గత కొంతకాలంగా వరుసగా ఆందోళనలు చేస్తున్న రైతులను ధర్మపురి అరవింద్ అడ్డుకుంటున్నారని, ఇంకెంతకాలం మోసం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. పసుపు బోర్డుపై ఆందోళనలను ఉదృతం చేస్తామని చెబుతున్న అన్నదాతలు, ఎంపీ ధర్మపురి అరవింద్, బిజెపి నేతలకు చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+