వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది ఢిల్లీ రైతుల పోరాట విజయం.!ఓటమి భయంతోనే మోదీ వెనక్కు తగ్గారన్న కోదండరాం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పోరాడితే ఏదైనా సాధ్యమని ఢిల్లీలో రైతులు నిరూపించారని జనజమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేసారు. బీజేపీ ఆధిపత్యానికి గండి పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ గ్రహించే వ్యవసాయ చట్టాల పట్ల వెనక్కి తగ్గారని కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేసారు. ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేసారు. పరిష్కారం చూపాల్సిన వారే నిరసన తెలిపి చేతులు దులుపుకోవటం హాస్యాస్పదమని, ధాన్యం కొనుగోలుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకెళ్ళి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేటట్టు కేంద్రం ఒత్తిడి తేవాలని గులాబీ ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్ చేసారు.

వ్యవసాయ చట్టాల రద్దును ఆహ్వానిస్తున్నాం.. ఓటమిని పసిగట్టే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారన్న కోదండరాం

వ్యవసాయ చట్టాల రద్దును ఆహ్వానిస్తున్నాం.. ఓటమిని పసిగట్టే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారన్న కోదండరాం

మూడు వ్యవసాయ చట్టాల రద్దు ఆహ్వానించ దగిన పరిణామమని, ఇది రైతు ఉద్యమ విజయమని, రైతులు సంవత్సర కాలం పాటు గడ్డ కట్టే చలికి భయపడకుండా, మండే ఎండలను తట్టుకొని సంఘటితంగా పోరాడి విజయం సాధించారని జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేసారు. ప్రజలు పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావని డిల్లి పోరాటం నుండి దేశ ప్రజలు నేర్చుకోవాలని కోదండరాం సూచించారు. రాజాకీయాలలో మార్పుకు కేవలం ఎన్నికలు, గెలుపు మాత్రమే కాదని, మరొక మార్గం వుందని డిల్లి రైతులు మార్గ నిర్దేషణ చేసారని కోదండరాం పేర్కొన్నారు.

ప్రాణాలు కోల్పోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలి.. అసలైన ఉద్యమానికి ఉదాహరణ ఇదేనన్న కోదండరాం

ప్రాణాలు కోల్పోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలి.. అసలైన ఉద్యమానికి ఉదాహరణ ఇదేనన్న కోదండరాం

ఢిల్లీ ఉద్యమంలో అశువులు బాసిన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోదండరాం డిమాండ్ చేసారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చించాలని కోదండరాం కోరారు. వరి సాగు చేయొద్దని బెదిరించటాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్టు, త్వరలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల్లో బరోసా నింపుతామని అన్నారు. రాజకీయాలను డబ్బులు శాశించలేవని, ప్రజలు సంఘటితమైతే రాజకీయ పార్టీలు దిగొస్తాయని, కోదండరాం తెలిపారు. పంటకు మద్దతు ధర కల్పించే చట్టాన్ని కేంద్రం తీసుకురావాలని అన్నారు. ముఖ్యమంత్రికి ఇచ్చినట్లే నిరసన తెలిపేందుకు దర్నాచౌక్ లో ప్రతిపక్షాలకు కూడా అనుమతి ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేసారు.

తెలంగాణ వరి పంటను కేంద్రం కొనాలి.. కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న కోదండరాం

తెలంగాణ వరి పంటను కేంద్రం కొనాలి.. కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న కోదండరాం

రాజకీయ పార్టీలు ఎన్నికలకు మాత్రమె పరిమితమౌతున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు రైతు ఉద్యమం లేవనెత్తిన డిమాండ్లలో ఒకటని, దానితో పాటు కనీస మద్దతు ధర హక్కుగా కల్పించే చట్టం రావాలని కోదండరాం కాంక్షించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను మరిచి రైతులను గందరగోళ స్థితిలోనికి నేట్టివేసాయని మండిపడ్డారు. రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో కాని, యాసంగి వరి సాగు విషయం పైన కాని స్పష్టతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేక పోయాయాయని కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. ధాన్యం కొనుగోలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని, కేంద్రం నుండి మద్దతు సాధించడానిక అసెంబ్లీలో చర్చించి, తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు.

కేసీఆర్ దర్నాలు, దీక్షలు చేసి చేతులు దులుపుకుంటే ఎట్ల.. వరి కొనాలన్న కోదండరాం

కేసీఆర్ దర్నాలు, దీక్షలు చేసి చేతులు దులుపుకుంటే ఎట్ల.. వరి కొనాలన్న కోదండరాం

అంతే కాకుండా తెలంగాణ ముఖ్య మంత్రి ధర్నాలకు, నిరసనలకు పరిమితం కావడం వలన ప్రయోజనం లేదని, ఈ సంవత్సరానికి కేంద్రం ఏ రకమైన బియ్యం, ఇచ్చినా స్వీకరించే విధంగా చంద్రశేఖర్ రావు ఒప్పించాలని డిమాండ్ చేసారు. మొత్తం బియ్యం సేకరణకు కేంద్రం మద్దతు ఇచ్చి తెలంగాణా రైతును ఆదుకోవాలని, అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి దాన్యం బస్తాల రవాణాకు కావలసినన్ని వాహనాలను సమకుర్చాలని, హమాలీలను నియమించాలని, కొనుగోలు కేంద్రాలలో తరుగు దోపిడిన నిలువరించి, కొనుగోలు కేంద్రాలలో కనీస సదుపాయాలను కల్పించాలని కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

English summary
Kodandaram, president of the Janajamiti, made it clear that farmers in Delhi had proved that anything was possible if they fought. Kodandaram made sensational remarks that Prime Minister Narendra Modi had backtracked on the agrarian laws which he perceived to be undermining the BJP's dominance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X