సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ తమిళిసై హాజరుకానిది అందుకే.. రాజ్‌భవన్ క్లారిటీ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మధ్య మరో పంచాయితీ ప్రస్తుతం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది. కొత్త సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పంపినా రాలేదని బీఆర్ఎస్ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై రాజ్ భవన్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

కొత్త సెక్రటేరియట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై కి ఆహ్వానం పంపించినా రాలేదని బీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. గవర్నర్ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని, తెలంగాణ మీద ఈర్ష్య తోనే గవర్నర్ తమిళిసై రాలేదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె రాకపోవడం వల్ల జరిగిన నష్టం ఏమీలేదని, ఆమె నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్యలు చేశారు.

This is why Governor Tamilisai did not attend the Secretariat inauguration.. Raj Bhavan Clarity!!

నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి గవర్నర్ రాకపోవడంపై జరుగుతున్న చర్చ పై రాజ్ భవన్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం అందలేదని రాజ్ భవన్ స్పష్టంచేసింది. ఆహ్వానం పంపామని రాష్ట్రప్రభుత్వం చెప్పడం తప్పని, గవర్నర్ తమిళిసై కి అసలు ఆహ్వానం పంపించలేదని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన రాజ్ భవన్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై కి మధ్య ఎప్పటి నుంచో విమర్శల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తనను అడుగడుగున అవమానిస్తున్నారని గవర్నర్ తమిళిసై అనేకమార్లు తెలంగాణ ప్రభుత్వం తీరుపై బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలు, మంత్రులు తమిళిసై బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని, ఆమె గవర్నర్ లాగా వ్యవహరించడం లేదని ఆమె పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇప్పటికే అనేక విషయాలలో తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పెద్ద అగాథం చోటుచేసుకోగా, తాజాగా నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం విషయంలో కూడా వివాదం చోటు చేసుకుంది. గవర్నర్ తమిళిసై ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం పై ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను పిలవకపోవడం ఏమిటి అని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును నిలదీస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+