కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతిపై రేవంత్ రెడ్డి సీబీఐ దర్యాప్తు కోరనిది ఇందుకే!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న రగడ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం విషయంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ వేదికగా చేసిన ఆరోపణలు, మేడిగడ్డకు వెళ్లి మరీ మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి కెసిఆర్ అవినీతిని ఎండగట్టిన తీరు బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తును ఎందుకు కోరడం లేదన్నది ఇప్పుడు చర్చకు కారణంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గతంలో కోర్టులో ఒక పిటీషనర్ దాఖలు చేసిన కేసులో విచారణ జరిపిన క్రమంలో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేయడం లేదని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సిబిఐ అధికారులను వివరణ కోరింది.

దీంతో సిబిఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే, తమకు కావలసిన వనరులను సమకూరిస్తే తమకు దర్యాప్తు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని సిబిఐ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ విచారణ కోరడం లేదు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మరొక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉందని బిజెపి నేతలు పదే పదే చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని దర్యాప్తు చేసేందుకు సీబీఐకు అప్పగించడం లేదని ఆరోపిస్తున్నారు. కెసిఆర్ కు ఒకరకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని, లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని బిజెపి నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు.
మేడిగడ్డ కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం.
— Congress for Telangana (@Congress4TS) February 13, 2024
Chief Minister Revanth Reddy, Group of ministers and MLAs inspecting the sagged pillars of Medigadda.#MedigaddaBarrage #TelanganaAssembly @revanth_anumula pic.twitter.com/73TeiOwpx2
అయినప్పటికీ రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ దర్యాప్తు కోరడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం కేసీఆర్ ను, కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిని తూర్పారబడుతున్న రేవంత్ రెడ్డి తాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరితే కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని, రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు కి ఓకే చెప్పిందని పేర్కొన్నారు.
"కాళేశ్వరం కరప్షన్ రావు"
— Congress for Telangana (@Congress4TS) February 13, 2024
కట్టిన పేకమేడ ప్రాజెక్ట్
A view of damaged barrage and pillars. pic.twitter.com/TkH3efjU6p
సిబిఐ కంటే న్యాయమూర్తి సారధ్యంలో దర్యాప్తు చేస్తే పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. సిబిఐ దర్యాప్తు కోరితే దర్యాప్తు సంస్థ కేంద్రం అధీనంలో ఉంటుంది కాబట్టి బిజెపి కేసీఆర్ కు గాలం వెయ్యాలని అనుకుంటున్నదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ ను కాళేశ్వరం అవినీతి పేరుతో గ్రిప్ లో పెట్టుకోవడం కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ దర్యాప్తుకు రేవంత్ రెడ్డి ఆసక్తి చూపించడం లేదు.












Click it and Unblock the Notifications