ఆదిలోనే హంసపాదు.!టీ సేవ్ ఫోరానికి మద్దత్తు ఇవ్వలేమంటున్న ఆ నేతలు.!అయోమయంలో షర్మిలమ్మ.!
హైదరాబాద్ : నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా ఉండేందుకు, భవిష్యత్తులో ప్రభుత్వ తప్పిదాల పట్ల సమర్ధవంతంగా ప్రశ్నించేందుకు వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిళ టీ సేవ్ ఫోరాన్ని ఆవిష్కరించారు. ఇందులో అన్ని రాజకయ పార్టీలను బాగస్వామ్యం చేస్తూ ఓ కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. అంతే కాకుండా ఈ ఫోరంలో రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ విధానాలను ఎండగట్టే స్వేచ్చ ఉందని, అందరు రాజకీయ నాయకులు ఈ వేదిక మీదకు రావాలని షర్మిళ పిలునిచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ నేతలతో సంప్రదింపులు కూడా జరిపారు.
ప్రతిష్టాత్మకంగా టీ సేవ్.. రాజకీయ నేతలకు షర్మిళ ఫోన్: అంతే కాకుండా అందరూ కలిసి వస్తే విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపి ప్రభుత్వ అసమర్ధ విధానాలకు చెక్ పెట్టొచ్చని షర్మిళ వివరించారు. ఇంతవరకు షర్మిళ స్క్రిప్ట్ బాగానే ఉన్నా ఆ రెండు ముఖ్య పార్టీల అద్యక్షులు మాత్రం షర్మిళకు మొండి చేయి చూపించారు. దీంతో షర్మిళ అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది. జనసమితి అధినేత కోదండరాంతో సమా వామపక్షాల నేతలను సంప్రదించినప్పటికీ ఆ రెండు కీలక పార్టీల మద్దత్తు లేకపోతే టీ సేప్ లక్ష్యం ఎలా నెవేరుతుందనే చర్చ లోటస్ పాండ్ లో మొదలయినట్టు తెలుస్తోంది.
విద్యార్ధి లోకానికి అండగా టీ సేవ్.. రాజకీయ మద్దత్తు కోసం షర్మిళ ఆరాటం: తెలంగాణలో నిరుద్యోగులను, విద్యార్థలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేస్తోందని, పరీక్షల విషయంలో విద్యార్థులను, ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులను పచ్చి మోసం చేస్తోందని, వారి జీవితాలతో ప్రభుత్వం చెటగాటమాడుతోందని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు.

ఏ ఒక్క పోటీ పరిక్షను కూడా సరైన పద్దతిలో నిర్వహించే సామర్త్యం ప్రభుత్వానికి లేదని మండిపడుతున్నారు. కోటి ఆశలతో పోటీ పరీక్షలు రాస్తే చివరికి ఆ పరీక్షలను ప్రభుత్వం నిర్ధిక్షిణ్యంగా రద్దు చేస్తోందని, ఇది అత్యంత దారుణమని షర్మిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపద్యంలోనే వైయస్ షర్మిళ టీ సేవ్ పేరుతో ఓ ఫోరం ను ప్రారంభించారు.
ఫోరంతో మేం కలిసి రాలేం.. తేల్చి చెప్పిన రేవంత్, బండి సంజయ్..: ఇంతవరకూ బాగానే ఉన్నా షర్మిళ ఫోరానికి ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపి పార్టీలు తమ తమ మద్దత్తు ఇవ్వబోమని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఫోరంలో బీజేపి భాగస్వామ్యం ఐతే కాంగ్రెస్ పార్టీ తమ సంఘీభావం ఉండదని, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంటే బీజేపి ఫోరానికి దూరంగా ఉంటుందని ఆయా పార్టీల అద్యక్షులు షర్మిలకు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
ఫోరం ప్రకటించిన మరుక్షణం రేవంత్ రెడ్డికి, బండి సంజయ్ కి ఫోన్ చేసిన షర్మిళకు వారి నుండి ఇదే సమాధానం రావడంతో షర్మిళ ఖంగుతిన్నట్టు తెలుస్తోంది. దీంతో షర్మిళ టీసేవ్ ఫోరాన్ని ఆ రెండు ప్రధాన పార్టీలు లేకుండానే ముందుకు నడిపిస్తారా లేక వారిని వేరే రూపంలో ఒప్పిస్తారా అనేదే ఆసక్తికరంగా మారింది. దీంతో షర్మిళ విద్యర్ధిలోకం కోసం రూపొందించిన టీ సేవ్ ఫోరానికి ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టు చర్చ జరుగుతోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications