సాయంత్రంలోగా నిన్ను చంపేస్తాం - ఎంపీ రఘునందన్ కు బెదిరింపు..!!
మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి ఈ సాయంత్రం లోగా చంపేస్తామంటూ హెచ్చరించారు. తాము మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టు గా అగంతకుడు ఫోన్ కాల్ లో బెదిరించాడు. రఘునందన్ పీఏ తో మాట్లాడిన అంగతకుడు ఈ సాయంత్రం లోగా చంపేస్తామంటూ హెచ్చరించాడు. వెంటనే దీని పైన రఘునందన్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి రఘనందన్‌రావు హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఫోన్‌కాల్‌ను రఘునందన్‌రావు పీఏ(పర్సనల్ అసిస్టెంట్) లిఫ్ట్ చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్‌పై రాష్ట్ర డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై బీజేపీ అగ్రనేతలు ఎంపీ రఘునందన్‌రావుకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసు కుంటున్నారు. కాల్ నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఎక్కడ నుంచి ఈ కాల్ వచ్చింది అనేది ఆరా తీస్తున్నారు.

2024 ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు పార్టీలో క్రియాశీలకం గా మారారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లక్ష్యంగా పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మూడు పార్టీలకు ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయంగా కీలకమైన ప్రాంతం. ఇదే ప్రాంతం నుంచి బీజేపీ నాయకుడిగా రఘునందన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇప్పుడు వచ్చిన బెదిరింపు కాల్ తో వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ కాల్ పైన వెంటనే స్పందించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications