Crime News: చేపల కోసం వెళ్లి నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీలో విషాదం జరిగింది. సోలీపూర్ శివారులో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. షాద్‌నగర్ కు చెందిన అక్షిత్ గౌడ్, ఫరీద్, ఫరీన్ ఈ ఉదయం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఆడుకుంటూ.. ఓ చోట వెంచర్ కోసం వేసిన స్థలంలో నీరు నిలవగా.. అందులో చేపలు పట్టేందుకు వెళ్లారు.
ఈత రాక
అందులో దిగేందుకు ప్రయత్నించగా జారిపడ్డారు. వారు ఈత రాక మునిగిపోయి అక్కడికక్కడే నీటిలో మునిగి చనిపోయారు. అయితే ఎప్పుడో వెళ్లిన తమ పిల్లలు ఇంకా రాలేదని వారు వారి కోసం వెతకడం మొదలు పెట్టారు. వెతుకుంటూ వెంచర్ వద్దకు వచ్చారు. అయితే అప్పటికే చనిపోయి చాలా సేపు కావడంతో పిల్లల మృతదేహాలు పైకి తేలియాడుతూ కనిపించాయి.

కేసు పెట్టాలి
కుమారుల మృతదేహాలు చూసిన తల్లిదండ్రులు వెక్కివెక్కి ఏడ్చారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురు పిల్లల 10 ఏళ్ల లోపువారేనని పోలీసులు తెలిపారు. అయితే లోతుగా తవ్విన వెంచర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications