మూడు రోజుల పాటు మద్యం బంద్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ఎందుకంటే?
తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం బంద్ కానుంది. వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్స్‌కు వాటికి అనుబంధంగా ఉన్న బార్‌లు మూసివేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మద్యం అమ్మకాలను నిషేదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మద్యం అమ్మకాలకు నిలిచిపోనున్నాయి.
ఉమ్మడి మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోకవర్గం. వరంగల్- ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ మూడు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 29న షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 27న ఉ.8 - సా.4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 191 మండలాల పరిధిలో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు కేసుకోకుండా చర్యలు చేపట్టారు.

శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుండి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం నిషేధం అమల్లో ఉంటుంది. కొల్లూరు , ఆర్సీ పురం పోలీస్ స్టేషన్ల పరిధిలోని కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. గ్రాడ్యుయేట్స్ , టీచర్స్ నియోజకవర్గాల నుండి ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు ఈ నిషేధం విధించారు. ఈ ప్రాంతాల్లోని నివాసితులు మద్యం అమ్మకాలు అనుమతించబడవు కాబట్టి తదనుగుణంగా తమ ప్రణాళికలను చేసుకోవాలని సూచించారు.
ఈ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాల నుండి మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.200 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహాయ రిటర్నింగ్ అధికారులు 14, ప్రిసైడింగ్ అధికారులు 252, ఎన్నికల అధికారులు 743, సూక్ష్మ పరిశీలకులు 252 మందిని ఎన్నికల సంఘం నియమించింది. ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 25,797. వీరిలో పురుషులు-15,483, మహిళలు-10,314 మంది ఉన్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుంది.












Click it and Unblock the Notifications