ముగ్గురిపై యువకుడి అత్యాచారయత్నం: డాక్టర్ మోసంతో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య

హైదరాబాద్: హైదరాబాద్‌ నగర పరిధిలోని హుమాయున్‌నగర్‌లో ముగ్గురు బాలికలపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదిలావుంటే, హైదరాబాదులోని మీర్‌పేటలో ఓ వైద్యుడు చేిసన మోసం కారణంగా ల్యాబ్ టెక్నీషియన్ ప్రాణాలు తీసుకున్నాడు. దాంతో డాక్టర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మీర్‌పేటలోని సాయి శ్రీనివాస ఆస్పత్రిలో మల్లేష్ అనే యువకుడు ల్యాబ్ టెక్నీషియన్‌గా కొద్ది కాలంగా పనిచేస్తూ వస్తున్నాడు.

డాక్టర్ అశోక్ కుమార్ వద్ద మల్లేష్ తన భూమి పత్రాలు పెట్టి రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అశోక్ కుమార్ రూ.2 లక్షలను 20 లక్షలుగా చిత్రీకరించి అతన్ని వేధిస్తున్నాడు. దీంతో అశోక్ కుమార్ తనను మోసం చేశాడని ఆరోపిసతూ సూసైడ్ నోట్ రాసి మల్లేష్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.

Three girls sexually assaulted in Hyderabad

రుణభారంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని ద్వారకానగర్‌కు చెందిన గడ్డమీది బాలయ్య (40) తనకున్న ఏడెకరాల్లో వరి, పత్తి, కంది సాగు చేశాడు. నీటి వసతి కోసం ఆరు బోర్లు వేయించగా రెండు మాత్రమే సక్సెస్ అయ్యాయి.

అందుకు అతను 8 లక్షల రూపాయలు అప్పు చేశాడు. పంటలు చేతికి రాకపోవడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురై గురువారం రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+