ఐదుగురిని చంపారు: ఇంటికెళ్లి లేడీ మాజీ కౌన్సిలర్‌ను నరికారు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా పట్టణం పాత కక్షలతో అట్టుడికి పోయింది. కుటుంబ కక్షల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను ప్రత్యర్థులు నరికి చంపారు. భైంసాలోని బార్ ఇనామ్ గల్లీలో నివాసముంటున్న మాజీ కౌన్సిలర్ వహీదా బేగం(50), ఆమె భర్త న్యామత్ ఖాన్(55), వీరికి కుమారుడి వరుసయ్యే యూనిస్ ఖాన్ (32) ప్రత్యర్థుల దాడిలో హతమయ్యారు.
తొలుత పట్టణంలోని నిర్మల్ క్రాస్ రోడ్ సమీపంలో న్యామత్, యూసఫ్‌లను ప్రత్యర్థులు వెంటాడి గొంతుకోసి చంపారు. తుక్కు దుకాణంలో ఉన్న వారి కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత బార్ ఇనామ్ గల్లీకి వెళ్లి ఇంట్లో ఉన్న వహీదా ఖానమ్‌ను నరికి చంపారు. ఈ ఘటనతో భైంసా పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడికి పాల్పడిన వ్యక్తులు అటు నుంచి పరారీ అయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు.












Click it and Unblock the Notifications