రంగారెడ్డి జిల్లాలోఘోర ప్రమాదం: ముగ్గురు ఫేస్‌బుక్ టెక్కీలు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సభవించింది.హైదరాబాద్ - బీజాపూర్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు అక్కడికి అక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
యువకులు ప్రయాణిస్తున్న ఆల్టో కారు మర్రి చెట్టుకు ఢీకొట్టింది. మృతులను కాచిగూడకు చెందిన ప్రవీణ్, మహబూబ్ నగర్‌కు చెందిన డేవిడ్‌లుగా పోలీసులు గుర్తించారు. మరో మృతుడు అర్జున్ స్వస్థలం తెలియాల్సి ఉంది. వీరు ఫేస్‌బుక్‌లో సాఫ్టువేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు.

ప్రమాదంలో గాయపడిన శ్రావణ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications