దారుణం: వరంగల్‌లో మూగ యువతిపై గ్యాంగ్ రేప్-అమ్మమ్మ ముందే టీనేజర్ల అఘాయిత్యం
వరంగల్‌లో దారుణం జరిగింది. ఓ మూగ యువతిపై ముగ్గురు టీనేజ్ అబ్బాయిలు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆమె అమ్మమ్మ ముందే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆ వృద్దురాలికి చూపు సరిగా లేకపోవడంతో ఆ ఆకృత్యాన్ని గుర్తించలేకపోయింది. బాధితురాలు మూగ యువతి కావడం... ఆమె అమ్మమ్మకు చూపు సరిగా లేకపోవడం... ఇదే అదనుగా నిందితులు ఆమెపై దుర్మార్గానికి ఒడిగట్టారు. అంతేకాదు,లైంగిక దాడిని వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వరంగల్‌లోని రంగశాయిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగింది...
వరంగల్‌లోని రంగశాయిపేటలో ఓ మూగ యువతి(23) తన తండ్రితో కలిసి నివసిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఆమె తల్లి చనిపోవడంతో తండ్రి,ఆ యువతి ఇద్దరే ఉంటున్నారు. ఇటీవల ఓరోజు తండ్రి పని మీద బయటకు వెళ్లడంతో... ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ యువతి సమీపంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు టీనేజీ అబ్బాయిలు యువతిపై కన్నేశారు. యువతి అమ్మమ్మకు కంటిచూపు సరిగా లేని విషయం,ఆ యువతి మూగది అన్న విషయం వారికి తెలియడంతో... ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్ చేశారు.

అమ్మమ్మ ముందే అత్యాచారం...
యువతి తన అమ్మమ్మ వద్ద ఉన్న సమయంలో ఆ ముగ్గురు ఇంట్లోకి చొరబడ్డారు. యువతికి మాయ మాటలు చెప్పి.. అమ్మమ్మ ముందే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిందితులు అక్కడితో ఆగక... అదంతా తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మూగ యువతి కావడంతో జరుగుతున్న ఆకృత్యంపై ఆమె నోరు మెదపలేకపోయింది. కంటి చూపు సరిగా లేకపోవడంతో... అత్యాచార ఘటనను ఆ వృద్దురాలు గ్రహించలేకపోయింది. ఘటన అనంతరం అమ్మమ్మ ఇంటి నుంచి తమ ఇంటికి వెళ్లిన యువతి... జరిగిన ఘటన గురించి తండ్రికి చెప్పింది.

కేసు నమోదు చేసిన పోలీసులు
కూతురిని వెంట పెట్టుకుని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆ తండ్రి నిందితులపై ఫిర్యాదు చేశారు. నిందితుల వయసు 15-16 ఏళ్లు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,తన బిడ్డకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై లైంగిక దాడులకు తెరపడకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications