హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యజమానితో సహజీవనం: మహిళపై ముగ్గురు రేప్, మరొకతను హెల్స్

ఫ్యాక్టరీ యాజమానితో సహజీవనం చేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని అనుకున్న కార్మికులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఆమె వారితో సంబంధానికి నిరాకరించడమే కాకుండా ప్రతి విషయాయనికి వారిపై విరుచుకు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫ్యాక్టరీ యాజమానితో సహజీవనం చేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని అనుకున్న కార్మికులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఆమె వారితో సంబంధానికి నిరాకరించడమే కాకుండా ప్రతి విషయాయనికి వారిపై విరుచుకుపడడం సాగించింది.

ఓ చిన్న వివాదంలో ఆ మహిళ ఒకరిని చెప్పుతో కొట్టింది. దీంంతో ముగ్గురు కార్మికులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. ఓ రోజు డబ్బుల కోసం ఫోన్‌ చేశారు. యజమాని గోవా వెళ్లాడని చెప్పడంతో ఇదే అదనుగా భావించారు. ఆ ముగ్గురూ ఒంటరిగా ఉన్న ఆమె ఇంటికి వెళ్లారు.

లోనికి వెళ్లి ఆమెను కత్తితో బెదిరించారు. ఆమె కేకలు వేసింది. దీంతో మెడపై కత్తిపెట్టి నోరు మూశారు. ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. అందుకు మరొకడు సహకరించాడు. ఆ తర్వాత కత్తితో ఆమె మెడ కోశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత చేతికి ఉన్న గడియారం, సెల్‌ఫోన్‌ తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోతూ కీని దారిలో పడేశారు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ అల్లూరి గంగారెడ్డి ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

కత్తిని మూసీలో పారేశారు...

కత్తిని మూసీలో పారేశారు...

మహిళను హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి మూసీలో పారేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అత్యాచారం, హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు ఎప్పటి లాగానే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మరో వ్యక్తికి సెల్‌ఫోన్‌ ఇచ్చి స్వస్థలమైన అసోంకు పంపించారు. ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గతనెల 29న పోలీసులకు సమాచారం ఇవ్వగా హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.

మృతురాలి సెల్‌ఫోన్‌ గురించి

మృతురాలి సెల్‌ఫోన్‌ గురించి

మృతురాలి సెల్‌ఫోన్‌ గురించి హైదరాబాదులోని మలక్‌పేట పోలీసులు ఆరా తీశారు. దీంతో అది అసోంలో ఉన్నట్లు తేలింది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఏడుగురు కార్మికుల్లో ఒకరు హత్య జరిగినప్పటి నుంచి విధులకు హాజరు కాకపోవడంతో ఆ కోణంలో కేసు దర్యాప్తు సాగించారు. కార్మికులు అత్యాచారం చేసి ఆమెను హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు బాలనేరస్థులని తేలింది.

ముసారాంబాగ్‌ ఈస్ట్‌ ప్రశాంత్‌నగర్‌

ముసారాంబాగ్‌ ఈస్ట్‌ ప్రశాంత్‌నగర్‌

ముసారాంబాగ్‌ ఈస్ట్‌ ప్రశాంత్‌నగర్‌ నివాసి పర్వీన్‌బేగం(38)కు అబ్దుల్‌ సమద్‌తో 20 ఏళ్ల కిత్రం పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు కలిగాడు.అతడు ఆమె సోదరుడు సయ్యద్‌ నిజాం వద్ద ఉంటున్నాడు. పర్వీన్‌ బేగం 2005 నుంచి ఢిల్లీకి చెందిన ఇక్రముద్దీన్‌తో సహజీవనం చేస్తోంది. ఇక్రముద్దీన్‌ ఈస్ట్‌ ప్రశాంత్‌నగర్‌ కాలనీలో కూలర్‌లు తయారు చేసి విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. చెంగిచెర్లలో సోఫాలు, బెడ్‌లకు ఉపయోగించే కొబ్బరి పీచు తయారు చేసే ఫ్యాక్టరీని ఇక్రముద్దీన్‌, మహ్మద్‌ తకియా అఫ్సర్‌తో కలిసి నడుపుతున్నాడు.

ఇక్రముద్దీన్‌ వ్యాపారం నిమిత్తం

ఇక్రముద్దీన్‌ వ్యాపారం నిమిత్తం

ఇక్రముద్దీన్‌ వ్యాపారం నిమిత్తం ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు పర్వీన్‌బేగం ఫ్యాక్టరీకి వెళ్లి కార్మికులతో పనులు చేయించేది. కంపెనీలో అసోంకు చెందిన ఏడుగురు పనిచేస్తున్నారు. వీరిలో దుబ్రీ జిల్లాకు చెందిన అమీర్‌చాన్‌(19)తోపాటు ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఇక్రముద్దీన్‌తో పర్వీన్‌బేగం సహజీవనం చేస్తున్నట్టు వారు తెలుసుకుని వివాహేతర సంబంధం కోసం వారు ఒత్తిడి చేయగా నిరాకరించింది. పని సరిగా చేయలేదని తిట్టింది.

ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌కు

ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌కు

ఓ రోజు ఫ్యాక్టరీలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌కు మోటార్‌తో నీళ్లు ఎక్కించగా ట్యాంక్ నిండి కిందపడ్డాయి. దీనిపై పర్వీన్‌ బేగం అందరి ముందు అమీర్‌చాన్‌ను చెప్పుతో కొట్టింది. అవమానంగా భావించిన అతడు ఆమెపై కక్ష గట్టాడు. సెప్టెంబర్‌ 23న ఇక్రముద్దీన్‌ గోవా వెళ్లాడు. అమీర్‌చాన్‌ 24న పర్వీన్‌బేగానికి ఫోన్‌ చేసి డబ్బులు కావాలని అడిగాడు. ఇక్రముద్దీన్‌ లేడని.. గోవా వెళ్లాడని.. 27న వస్తాడని చెప్పింది. ఆమె ఒంటరిగా ఉండడంతో అదే తగిన సమయమని భావించిన అతడు చెంగిచెర్లలో కత్తి కొనుగోలు చేశాడు. 24వ తేదీ రాత్రి 9 గంటలకు ఆటోలో ఇద్దరు మైనర్లతో కలిసి ముసారాంబాగ్‌ బ్రిడ్జి వద్దకు వచ్చారు. ఆమె ఇంటికెళ్లి తలుపు కొట్టగా తీయగానే కత్తితో బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారు.

మెడపై ఓ మైనర్‌ కత్తిపెట్టి

మెడపై ఓ మైనర్‌ కత్తిపెట్టి

తలుపులు వేసి గడియపెట్టి బేగం మెడపై ఓ మైనర్‌ కత్తిపెట్టి నోరు మూశాడు. అమీర్‌చాన్‌తోపాటు మరో మైనర్‌ అత్యాచారం చేశారు. అనంతరం ఆమె మెడ కోసం చేతికున్న గడియారం, సెల్‌ఫోన్‌ తీసుకుని ఇంటికి తాళం వేశారు. పోతూ పోతూ కీని కత్తిని మూసీలో పారేసి చెంగిచర్లలో ఫ్యాక్టరీ వద్ద గల గదికి చేరుకున్నారు. ఓ మైనర్‌కు సెల్‌ఫోన్‌ ఇచ్చి అదేరోజు రాత్రి అసోం పంపించారు. 29వ తేదీన ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మలక్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థలానికి చేరుకుని పరిశీలించారు

స్థలానికి చేరుకుని పరిశీలించారు

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాంతో ఆమె హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్యాక్టరీలో ఏడురుగు పనిచేయాల్సి ఉండగా ఆరుగురే ఉన్నట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. బేగం హత్య జరిగినప్పటి నుంచి మరొకరు కనిపించకపోవడంతో ఆరా తీయగా అసోం వెళ్లినట్టు తేలింది. మృతురాలు పర్వీన్‌బేగం సెల్‌ఫోన్‌ ఆన్‌లో ఉండడంతో టవర్‌ లోకేషన్‌ ఆధారంగా అసోంలో ఉన్నట్టు కనిపెట్టారు. అతడిని నగరానికి రప్పించారు. సోమవారం అదుపులోకి తీసుకుని విచారించారు. అమీర్‌చాన్‌తోపాటు ఇద్దరు మైనర్లు ఆమె హత్యకు కారకులని తేలింది. ముగ్గురినీ అరెస్టు చేశారు.

English summary
Three workers in a factory have been arrested in a rape and murder case in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X