Rythu Bandhu: రైతు బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి లేనట్లే..
గత ప్రభుత్వం పేరు భూమి ఉంటే చాలు రైతు బంధు డబ్బులు అకౌంట్ లో వేసేది. ఆ భూమిని సాగు చేస్తున్నారా.. ఆ భూమిలో కొండలు ఉన్నాయా.. రైతు బంధు తీసుకునేందుకు వారు అర్హులేనా అనేది ఆలోచించకండా ప్రజల సొమ్ము వృథా చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో పలు మార్పు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే.. సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా రైతు బంధుకు పరిమితి విధించాలని కూడా చూస్తోంది. గత ప్రభుత్వం ఎంత భూమి ఉన్నా.. అంత భూమికి రైతు బంధు జమ చేసింది. ఈసారి ఐదేకరాల లోపు లేదా పదేకరాల లోపు మాత్రమే రైతు బంధు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పాత విధానం ప్రకారమే రైతు బంధు పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 69 లక్షల మంది అన్నదాతలకు రూ. 5,574 కోట్లు బ్యాంకు ఖాతాల్ల జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.

వరి పంటకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ను వచ్చే సీజన్ నుంచి ఇచ్చేందుకు ట్రై చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సీజన్ నుంచి పంట సాగు చేసిన వారికి రైతు బంధు ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు. ప్రజలు కూడా పంట సాగు చేస్తేనే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 92 శాతం మంది ఐదేకరాలలోపు ఉన్నవారే ఉన్నారని వివరించారు. ఏప్రిల్ చివరిలోగా రైతు బంధు పంపిణీ పూర్తి చేస్తామన్నారు.
రైతు రుణమాఫీ కూడా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకు నుంచి రుణాలు రాగానే రుణ మాఫీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గతంలో సినీ ప్రముఖులకు, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి కూడా రైతు బంధు డబ్బులు వచ్చాయి. దీంతో రైతు బంధు పథకంలో మార్పులు తేవాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications