ఇలా ప్లాన్ చేసుకుంటే సులువుగా శ్రీవారి దర్శనం
తెలంగాణ ఆర్టీసీ అధికారులు బస్సు టికెట్ తోపాటు స్వామి దర్శనం కోసం రూ.300 టికెట్లను అందుబాటులోకి తెచ్చారు.
కొండపైన స్వామి దర్శనం అంటే ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. టికెట్లు లేకుండా ఉచిత దర్శనానికి వెళితే రోజంతా క్యూ లైన్ లోనే ఉండాల్సి వస్తుంది. రూ.300 శీఘ్ర దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసినప్పటికీ వెంటనే అవన్నీ నిండుకుంటాయి. అయితే తిరుపతి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఒక అవకాశం కల్పిస్తోంది. ప్రతిరోజు వెయ్యి మంది భక్తులకు రూ.300 ప్రత్యేక దర్శనం కల్పించడానికి తితిదే అధికారులు అంగీకరించారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆన్ లైన్ లో తిరుపతికి బస్సు టికెట్ తోపాటు శీఘ్రదర్శనం రూ.300 టికెట్ కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మార్చి 18వ తేదీరకు లక్షకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు చెప్పారు. ఆర్టీసీ టికెట్‌తో పాటు రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్‌ను www.tsrtconline.in వెబ్‌సైట్లో ఒకేసారి పొందవచ్చని బాజిరెడ్డి పేర్కొన్నారు.

తిరుమలలో ఏడుకొండలవాడి దర్శనం కోసం రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్స్ అన్నీ నిండిపోయాయి. టీబీసీ వరకు ఉన్న క్యూ లైన్ లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిచూస్తున్నారు. సర్వదర్శనం కోసం క్యూలైన్ లో ఉన్నవారికి దర్శనం 5 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా వచ్చేవారికి 36 గంటలు పడుతోందని, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోందని చెప్పారు. నిన్న శ్రీవారిని 75,452 మంది భక్తులు దర్శించుకోగా 39,262 భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.05 కోట్లుగా వచ్చింది.












Click it and Unblock the Notifications