చంద్రబాబు బండారం బయటపెడ్తాం: సెక్షన్ 8పై గరంగరం (పిక్చర్స్)

హైదరాబాద్: సెక్షన్ 8 అమలు చేయాలనే డిమాండును నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. గన్ పార్కు వద్ద కూడా ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు.

భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆంధ్రా ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని నినదించారు.

మరోవైపు, శ్రీనివాస్‌ గౌడ్ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ టీజీవో యూనిట్ల అధికారులు, టీఎన్జీవో నాయకులు, పబ్లిక్‌సెక్టార్ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హజరయ్యారు. సెక్షన్-8 పేరుతో రాద్దాంతం చేస్తే తెలంగాణ సత్తా చాటుతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు.

ఆందోళన

ఆందోళన

చంద్రబాబు తిన్న ఇంటివాసాలు లెక్కపెడుతున్నారని నిప్పులు చెరిగారు. లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరించి భారీ బహిరంగను నిర్వహిస్తామని, చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని టీజీవో రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు హెచ్చరించారు.

ఆందోళన

ఆందోళన

సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా, కేంద్రం నామినేట్ చేసిన గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలని కోరడం అప్రజాస్వామికమని అన్నారు.

ఆందోళన

ఆందోళన

దేవీప్రసాద్ మాట్లాడుతూ... సెక్షన్-8కు అనుకూలంగా కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేసినా, తెలంగాణ ప్రజలను సంఘటితపరిచే ఉద్యమకార్యాచరణ సిద్ధం చేసుకుంటామని హెచ్చరించారు.

ఆందోళన

ఆందోళన

టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బాబు బండారం బయటపెడతామన్నారు.

ఆందోళన

ఆందోళన

సెక్షన్ 8 అమలు చేయాలనే డిమాండును నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. గన్ పార్కు వద్ద కూడా ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు.

ఆందోళన

ఆందోళన

భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+