ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలా: కేసీఆర్‌పై టీఎన్జీవోలు ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా కోదండరామ్, స్వామిగౌడ్‌లు ఎందుకు మాట్లాడటం లేదని టీఎన్జీవో నేతలు గురువారం ప్రశ్నించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కారని కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వెళతారని గతంలో ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు 6000 మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రా సర్కారు కింద పని చేస్తున్నా మాట్లాడటం లేదన్నారు. సూపర్‌ న్యూమరరీ పోస్టుల గురించి, పీఆర్సీ బకాయిల గురించి, హెల్త్ కార్డుల గురించి మాట్లాడటం లేదన్నారు.

TNGOs fires at Telangana government

సమ్మె క్రమబద్ధీకరణ గురించి మాట్లాడరన్నారు. ఉద్యోగ సంఘాలకు కనీసం అపాయింట్‌మెంటూ ఇవ్వడం లేదన్నారు. ఏ స్థాయిలో కూడా ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్లీగా లేదని సీఎం కేసీఆర్‌పై టీఎన్జీవో నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సాక్షాత్తూ సీఎం చెప్పినా 3 నెలల వరకూ పీఆర్సీ జీవోలు రాలేదన్నారు. కేసీఆర్‌ పిలుపు మేరకు సకల జనుల సమ్మె వంటి ఆందోళన కార్యక్రమాలూ చేపట్టారు. కేసీఆర్‌ను జూన్‌ 2న కలిసి మరోమారు తమ సమస్యలను చెప్పాలని ఉద్యోగులు భావిస్తున్నారు. అప్పటికీ తగిన ఫలితం రాకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+