హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు, అరెస్టు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతోందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు ఆరోపించారు.

వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను చేస్తూ ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. భారీ ఎత్తున ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలను అరెస్టు చేసి గాంధీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా మధుసూదన్‌రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. నిరుద్యోగుల భవిష్యత్తు బంగారు మయం చేస్తామని ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్‌ ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించిందని అన్నారు.

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తల ఆందోళన

తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతోందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు ఆరోపించారు.

 టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తల ఆందోళన

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తల ఆందోళన

వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను చేస్తూ ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. భారీ ఎత్తున ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తల ఆందోళన

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తల ఆందోళన

నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలను అరెస్టు చేసి గాంధీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తల ఆందోళన

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తల ఆందోళన

ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా మధుసూదన్‌రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. నిరుద్యోగుల భవిష్యత్తు బంగారు మయం చేస్తామని ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్‌ ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించిందని అన్నారు.

ఉద్యమ సమయంలో విద్యార్దులు, నిరుద్యోగులు చెమటోడ్చి తెలంగాణ సాధనకు కృషి చేశారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 9నెలలైనా ఒక్క ఉద్యో గానికీ నోటిఫికేషన్‌ జారీ చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగమని చెప్పి తన ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు.

డీఎస్సీని నిర్వ హించాల్సిన అవసరం ఉన్నా ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తోందని వాపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 10,300 ఉపాధ్యాయ, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని వారు వెల్లడించారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఎంఇఓ, ఇతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వేసవి సెలవులలోపు ఉపాద్యాయ నియా మక ప్రక్రియ పూర్తిచేసి విద్యార్ధులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

వారంలోగా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటన చేయకపోతే మహాధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ ఆందోళనలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు రఘుకిరన్‌, శరత్‌ చంద్ర, రాష్ట్ర నాయకులు బాబూలాల్‌ నాయక్‌, ప్రసాద్‌, శ్రీకాంత్‌రెడ్డి, రమాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
TNSF Protest At TPSC Office, arrested by Police at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X