Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కల్లు బుకింగ్... రెండు రోజుల ముందే .. మద్యం షాపుల బంద్ తో కల్లుకు మహా గిరాకీ

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటిస్తే కరోనా మాట అటుంచి మందుబాబులకు మహా పెద్ద కష్టాలు వచ్చి పడ్డాయి. మద్యం షాపులు లాక్ డౌన్ సందర్భంగా మూత పడటంతో మందు బాబులు మద్యం లేక పిచ్చివాళ్ళవుతున్నారు. ఇక ఇదే సమయంలో కల్లుకు గిరాకీ బాగా పెరిగింది. కల్లు కోసం జనాలు తాటివనాల దిక్కు పరుగులు పెడుతున్నారు. కల్లుకు బాగా డిమాండ్ రావటంతో కల్లు గీత కార్మికులు కల్లు ధరలు అమాంతం పెంచేశారు.

లాక్ డౌన్ ఎఫెక్ట్ ..కల్లుకు పెరిగిన గిరాకీ

లాక్ డౌన్ ఎఫెక్ట్ ..కల్లుకు పెరిగిన గిరాకీ

ఇక తాజాగా రెండు రోజుల ముందు బుకింగ్ చేసుకుంటేనే కల్లు దొరికే పరిస్థితి ఉందంటే కల్లుకున్న గిరాకీ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . కరోనా వైరస్ మహమ్మారి దేశ వ్యాప్తంగా విస్తరించకుండా అడ్డు కట్ట వెయ్యాలని భావించిన సర్కార్ లాక్ డౌన్ విధించింది . నిత్యావసరాలను అందించే షాపులు మినహాయించి మిగతా అన్నీ బంద్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . దీంతో మద్యం షాపులతో సహా బంద్ చెయ్యటంతో లిక్కర్ లేక ఉండలేని వారు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.మద్యం నిత్యావసరంగా మారిన మందుబాబులు జిహ్వ చాపల్యం ఆపుకోలేక కల్లు బాట పట్టారు.

కల్లు సీసా 50 రూపాయలు .... కల్తీ కల్లుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం

కల్లు సీసా 50 రూపాయలు .... కల్తీ కల్లుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం

దీంతో కల్లు గీత కార్మికులకు డిమాండ్ జోరుగా పెరిగింది . నిన్నా మొన్నటి దాకా 30 రూపాయలు అమ్మిన కల్లు సీసా ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు అమ్ముతుంది . ఇక ఎమర్జెన్సీ అంటే ధర ఇంకో రెండు రెట్లు అధికం . కల్లు కోసం తాటి, ఈత వనాల వద్ద జనాల పడిగాపులు అంతా ఇంతా కాదు . సందట్లో సడేమియా అంటూ కల్లుగీత కార్మికులు కల్తీలకు పాల్పడుతున్నారు. ఇక కల్తీ కల్లు తాగి జనాలు అనారోగ్యాలకు గురవుతున్నారు . కల్లు ఎలా ఉన్నా సరే జనాలు కావాలని పోటీ పడటంతో కల్తీ చేసి మరీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

రెండు రోజుల ముందు బుకింగ్ .. కల్లు సంపాదించటం అసలు టాస్క్

రెండు రోజుల ముందు బుకింగ్ .. కల్లు సంపాదించటం అసలు టాస్క్

ఇక ఇప్పుడు పరిస్థితి మొత్తానికి ఎలా తయారైంది అంటే రెండు రోజుల ముందే బుకింగ్ చేసుకోవాలి. అలా అయితేనే అధిక ధరకు అయినా కల్లు దొరికేది . లేదంటే అది కూడా దొరకని పరిస్థితి . దీంతో బుకింగ్ లకు ఎగబడుతున్నారు మందుబాబులు . ఇక తాటి చెట్ల వద్ద జనాలు పెరుగుతున్న నేపధ్యంలో పోలీసులు, సదరు గ్రామాల వాళ్ళు కల్లు గీత కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏకంగా కొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. ఇక గ్రామస్తులు ఇతర గ్రామాల వాళ్ళు ఎవరైనా కల్లు కోసం వచ్చినట్టు గుర్తిస్తే వాళ్ళ భరతం పడుతున్నారు . తరిమి తరిమి కొడుతున్నారు. ఇతర గ్రామాల వాళ్ళను రానివ్వకుండా చూడాలని కల్లుగీత కార్మికులకు చెప్తున్నారు.

 కల్లు దొరికితే హీరోలే .. కల్లు కోసం నానా చావు చస్తున్న మద్యం ప్రియులు

కల్లు దొరికితే హీరోలే .. కల్లు కోసం నానా చావు చస్తున్న మద్యం ప్రియులు

ఇక ఇలాంటి సమయంలో ఇన్ని కష్ట నష్టాలకు ఓర్చి కల్లు ఒక బాటిల్ సంపాదించారంటే వాళ్ళు హీరోల్లా ఫీల్ అవుతున్నారు. బయట నిత్యాసరాలకు తప్ప తిరగొద్దని పోలీసులు, అధికారులు చెప్తున్నా వాళ్ళ కళ్ళుగప్పి కల్లు కోసం వెళ్ళి నానా చావు చచ్చి చివరకు కల్లు సీసా సంపాదించి గుక్క తాగి హమ్మయ్య అని సంబరపడుతున్నారు. ఈ రోజుకు మందు దొరికినట్టే అని ఫీల్ అవుతున్నారు. మద్యం షాపులు లేకపోవటంతో కల్లు కోసం నానా చావు చస్తున్న మద్యం ప్రియుల తిప్పలు చూసి ఓర్నీ ఇంత పిచ్చా అని నోరెళ్ళబెట్టటం ఇదంతా చూస్తున్న వాళ్ళ పనిగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+