హైదరాబాదీలు అటు వెళ్తే 'టోలు' వలుస్తారు..!!
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచారు. రేపటి నుంచి (ఏప్రిల్ 1) పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేసే ఓఆర్ఆర్ నిర్వహణలో భాగంగా ఈ ఛార్జీలు పెంచినట్లు వెల్లడించింది. అటు హైదరాబాద్ - విజయవాడ టోల్ ప్లాజా ల వద్ద రసుము తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే.. ఇటు హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన ఛార్జీలు పెంచటం పైన భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. పెంపుదల వివరాలను సంస్థ వెల్లడించింది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటె డ్ సంస్థ వెల్లడించింది. రేపు (ఏప్రిల్ 1) నుంచి పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీ సీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐఆర్‌బీ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఒప్పందం సమయంలో ప్రతీ ఏటా టోల్ ఛార్జీలను పెంచుకొనే వెసులుబాటు సంస్థకు అప్పగించారు.

హైదరాబాద్ - విజయవాడ మధ్య జాతీయ రహదారి పై ప్రయాణం చేసే వాహన దారులకు ఈ అర్ద్రరాత్రి నుంచి టోల్ రుసుము తగ్గనుంది. ఈ మేరకు కొత్త ధరలను ఖరారు చేసారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం, కొర్ల పహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యానులకు ఒక వైపు ప్రయాణానికి రూ 15, ఇరు వైపులా రూ 30, వాణిజ్య వాహనాలకు ఒక వైపుకు రూ 25 నుంచి రెండు వైపులా కలిపి రూ 40 వరకు తగ్గింపు అమల్లోకి రానుంది.












Click it and Unblock the Notifications