• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రాకు సినీ రంగ తరలింపు అనుమానమేనా: బాబును మించి కేసీఆర్‌పై ప్రశంసలందుకేనా?

By Swetha Basvababu
|

హైదరాబాద్: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై (మద్రాస్) నుంచి తెలుగు చలన చిత్రసీమను తరలించడానికి 1989 - 94 మధ్య మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి నుంచి కోట్ల విజయ భాస్కర రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ సీఎంలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే, పలు రాయితీలు కల్పిస్తేనే హైదరాబాద్ నగరానికి వచ్చింది. 2001 నుంచి 2014 వరకు సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ ఏర్పాటైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేర్చారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండేళ్లు తిరక్కుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నూతన రాజధాని 'అమరావతి'కి తరలి వెళ్లింది.

  CM KCR Speech @ World Telugu Conference
  సినీ ప్రముఖులంతా కోస్తా, సీమ ప్రాంత వాసులే

  సినీ ప్రముఖులంతా కోస్తా, సీమ ప్రాంత వాసులే

  తెలుగు చలన చిత్రసీమలో అత్యధికులు కోస్తా, రాయలసీమ వారే. అయితే 55 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండటంతోపాటు తెలుగు చలన చిత్రసీమకు అవసరమైన వనరులన్నీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి. 1994 - 99 మధ్య ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు ‘రామోజీ ఫిల్మ్ సిటీ' నిర్మించారు. రామానాయుడు స్డూడియో.. ఎల్వీ ప్రసాద్ ఆడిటోరియం చలన చిత్ర నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులన్నీ భాగ్యనగరంలో అందుబాటులో ఉన్నాయి.

  సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని నియామకం

  సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని నియామకం

  2014కి ముందు తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలుగు చలనచిత్ర ప్రముఖులకు దగ్గరయ్యేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నది. 1995 - 2004 మధ్య చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్.. సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ అప్పగించారు.

  తెలంగాణ చేనేత ప్రచారకర్త ‘నాగ్’ కోడలు సమంత

  తెలంగాణ చేనేత ప్రచారకర్త ‘నాగ్’ కోడలు సమంత

  తెలంగాణ ఏర్పాటైన కొత్తలో ప్రభుత్వ భూమి, చెరువుల ఆక్రమణలపైన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై విమర్శలు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో మాదాపూర్ లోని ఎన్ - కన్వెన్షన్ సెంటర్‌లో కొంత భాగాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా తొలగించారు. తర్వాత ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావుతో అత్యంత సన్నిహితులయ్యారు. నాగార్జున కోడలు సమంత.. చేనేతకు బ్రాడ్ అంబసిడార్‌గా వ్యవహరిస్తున్నారు.

  మౌలిక వసతులు లేని ఏపీకి సినీ రంగం తరలి వెళ్తుందా?

  మౌలిక వసతులు లేని ఏపీకి సినీ రంగం తరలి వెళ్తుందా?

  ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలుగు చలనచిత్ర సీమను విశాఖ తీరానికి తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అన్ని రకాల మౌలిక వసతులు గల హైదరాబాద్ నగరాన్ని కాదని విశాఖ నగర తీరానికి వెళతారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ తాజాగా హైదరాబాద్ సిటీలో ఈ నెల 15 - 19 మధ్య హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి.

  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ముగింపు

  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ముగింపు

  ఉప రాష్ట్రపతి - తెలుగుతేజం ముప్పవరపు వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తే.. దేశ ప్రథమ పౌరుడు - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహాసభల్లో టాలీవుడ్ ప్రముఖులతో సంగీత విభావరి నిర్వహించింది రాష్ట్రప్రభుత్వం. మెగాస్టార్ చిరంజీవి మొదలు.. నందమూరి బాలక్రుష్ణ.. అక్కినేని కుటుంబ స్టార్లు పాల్గొన్నారు.

  మన ముఖమంత్రి.. మన హైదరాబాద్ అని పదేపదే ప్రశంసలు

  మన ముఖమంత్రి.. మన హైదరాబాద్ అని పదేపదే ప్రశంసలు

  తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, తెలంగాణ ప్రభుత్వాన్ని మెగాస్టార్ సహా సినీ ప్రముఖులంతా ప్రశంసల్లో ముంచెత్తారు. సంగీత విభావరిలో పాల్గొన్న మెగాస్టార్ కే చిరంజీవి, సీనియర్ సినీ నటుడు నందమూరి బాలక్రుష్ణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను సంబోధిస్తూ ‘మన ముఖ్యమంత్రి'.., హైదరాబాద్ నగరాన్ని ‘మన హైదరాబాద్' అని పదేపదే పేర్కొన్నారు.

  తెలుగు వారందరికీ గర్వకారణమని అల్లు అర్జున్ ట్వీట్

  తెలుగు వారందరికీ గర్వకారణమని అల్లు అర్జున్ ట్వీట్

  బుధవారం మెగాస్టార్ యువ నటుడు అల్లు అర్జున్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. తెలుగు భాషలో చాలా గొప్పగా ప్రోత్సహిస్తోందని ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ‘ప్రపంచ తెలుగు మహాసభలు' నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మహాసభలకు భారీ ప్రతిస్పందన లభిస్తున్నదని, వీటి నిర్వహణ తెలుగు వారందరికీ గర్వకారణమని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. తాను హైదరాబాద్ నగరంలో ఉన్నందుకు గర్వంతో ఉప్పొంగి పోతున్నానని పేర్కొనడం విశేషం.

  మాకూ భాగస్వామ్యం కల్పించాలన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్

  మాకూ భాగస్వామ్యం కల్పించాలన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్

  వాస్తవంగా ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘తెలుగు సినీ ప్రముఖుల' కార్యక్రమం షెడ్యూల్‌లో ఖరారు కానే లేదు. కానీ తమతో కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కోరింది. తెలుగు భాష అభివ్రుద్ధి కోసం తమ వంతుగా భాగస్వాములను చేయాలని అభ్యర్థించడంతో ‘సంగీత విభావరి' ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులంతా సీఎం కేసీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తడానికి పోటీ పడ్డారు.

  సీఎం కేసీఆర్‌పై రెబల్ స్టార్ క్రుష్ణంరాజు ప్రశంసల జల్లు

  సీఎం కేసీఆర్‌పై రెబల్ స్టార్ క్రుష్ణంరాజు ప్రశంసల జల్లు

  ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, సినీ నిర్మాత మంచు మోహన్‌బాబు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను సన్మానించారు. మహాసభలకు ఆహ్వానం అందని ‘రెబల్ స్టార్' క్రుష్ణం రాజు కూడా నాడు ఎన్టీఆర్ నేడు కేసీఆర్ అని అభినందించారు.

  ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే తీసుకు రాని ప్రముఖులు

  ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే తీసుకు రాని ప్రముఖులు

  కానీ సంగీత విభావరిలో పాల్గొన్న వారంతా పొరపాటున కూడా అపర చాణక్యుడిగా పేరొందిన ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేరే ఎత్తలేదు. చివరకు ఆంధ్రప్రదేశ్ ఊసు కూడా ప్రస్తావించలేదు. ప్రాంతాలకు అతీతంగా వారంతా తెలుగు భాషను ప్రోత్సహించాల్సిందేనని నొక్కి వక్కాణించారు.

  ఎక్కువ శాతం ఏపీలోనే సినిమాల ప్రదర్శన

  ఎక్కువ శాతం ఏపీలోనే సినిమాల ప్రదర్శన

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ ప్రముఖులంతా కోస్తాంధ్ర ప్రాంతం వారే. ఉమ్మడి రాష్ట్ర హయాంలో తెలంగాణ భాషను, సంస్క్రుతిని తక్కువ చేసి చూసేవారు. ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతంలోనే సినిమాలు ఆడుతుండేవి. కానీ సంగీత విభావరిలో పాల్గొన్న వారెవ్వరూ ‘ఆంధ్రా' సెంటిమెంట్ ఊసే ఎత్తలేదు.

  మౌలిక వసతుల్లేని ఏపీకి సినీ రంగం వెళ్తుందా?

  మౌలిక వసతుల్లేని ఏపీకి సినీ రంగం వెళ్తుందా?

  కానీ ‘నిజాం' మాత్రమే సినిమా రంగానికి స్థూలంగా ఆదాయం సమకూర్చే ప్రాంతంగా ఉంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా మౌలిక వసతులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులంతా చంద్రబాబు ఊసే ఎత్తకుండా కేసీఆర్‌ను పొగడంలో మునిగిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is now certain by all means that the Telugu film industry will not move out of Hyderabad and has no plans whatsoever to move out of Telangana. It was evident from the way the Telugu film stars heaped praised on Telangana government and chief minister K Chandrasekhar Rao.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more