హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ హీరో, ముగ్గురు హీరోయిన్లకు, దుమ్మురేపిన ఐటం డ్యాన్సర్‌కు నోటీసులు, ఎవరంటే..!?

డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ తాజాగా ఓ ప్రముఖ హీరో, టాప్ డైరెక్టర్, ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ లోపు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని వారు నోటీసుల్లో పేర్కొన్న

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ తాజాగా ఓ ప్రముఖ హీరో, టాప్ డైరెక్టర్, ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ లోపు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు.

టాలీవుడ్‌లో ప్రకంపనలు: ముగ్గురు హీరోలు సహా 10మందికి నోటీసులు టాలీవుడ్‌లో ప్రకంపనలు: ముగ్గురు హీరోలు సహా 10మందికి నోటీసులు

మొత్తం 15 మందికి

మొత్తం 15 మందికి

ఎక్సైజ్ శాఖ లిస్టులో మరికొందరు సినీ తారలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ మొత్తం 15 మంది సినీ స్టార్లకు నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.

హీరోలను పొగిడే నిర్మాత, ఆ నటుడు

హీరోలను పొగిడే నిర్మాత, ఆ నటుడు

బాలనటుడిగా నటించి, హీరోగా నటించి, ప్రస్తుతం సినిమాలు లేని ఓ నటుడికి ఎక్సైజ్ శాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. అలాగే ఓ వర్ధమాన గాయకురాలి భర్తకు, అలాగే సినిమా ఫంక్షన్లలో హీరోలను పదేపదే పొగిడే ఓ నిర్మాతకు, సినిమాల్లో బ్రేక్ లేక సెకండ్ హీరోగా స్థిరపడ్డ నటుడికి కూడా నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.

ఐటం సాంగ్స్‌తో దుమ్మురేపిన నటికి

ఐటం సాంగ్స్‌తో దుమ్మురేపిన నటికి

సినిమాలు వేగంగా తీస్తాడనే ఓ డైరెక్టర్‌కు, ఆ డైరెక్టర్‌కు క్లోజ్‌గా ఉంటూ, ప్రొడక్షన్ బాధ్యతలు చూసే హీరోయిన్, మాస్ సినిమాలతో పేరు తెచ్చుకొని ఇప్పుడు ఫాంలో లేని హీరో, ఇప్పుడు సినిమాలు లేని నటుడు, ఒకప్పుడు ఐటం సాంగ్స్‌లో దుమ్మురేపి, ఇప్పుడు అంతగా లేని ఓ నటి తదితరులకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ తీసుకునే వారికి గచ్చిబౌలిలోని ఓ పబ్ అడ్డాగా మారిందని తెలుస్తోంది.

సిట్ ముందు హాజరు కావాల్సిందే: అకున్ సబర్వాల్

సిట్ ముందు హాజరు కావాల్సిందే: అకున్ సబర్వాల్

నోటీసులు వెళ్లిన సినీ ప్రముఖులు సిట్ ముందు హాజరు కావాల్సిందేనని ఉన్నతాధికారి అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. సినీ ప్రముఖుల చిట్టా ఇంకా పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు.

English summary
15 Tollywood personalities, including two heroines, were issued notices by Special Task Force (STF) of the prohibition and excise department for substance abuse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X