Tollywood Gossips: మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి ఎందుకు..ఆ క్రేజీ కాంబో రిపీట్ అవుతుందా..?

హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో గాసిప్స్‌కు కొదవ లేదు. ఏ చిన్న హ్యాపెనింగ్ అయినా సరే దానిపై నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవటం ఆనవాయితీగా మారింది. ఇలాంటి కొన్ని హ్యాపెనింగ్స్‌తో పాటు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్న కొన్ని గాసిప్స్ గురించి ఇక్కడ చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి వెనక...

మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి వెనక...

మెగాస్టార్ చిరంజీవి... ఈ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే కొరటాల శివ తప్పిదంతోనే చిరంజీవికి ఫ్లాప్ వచ్చిందంటూ అభిమానులు తమకు తాము సర్ది చెప్పుకున్నారు. మలయాలం రీమేక్ లూసీఫర్‌ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్‌‌గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు.ఈ చిత్రం విడుదలకు మరో నెలరోజుల సమయం మాత్రమే ఉండగా దీనిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా చర్చ జరగడం లేదు. దీంతో మెగాస్టార్ ఒక్కింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఇప్పటికే రిలీజ్ అయిన గాడ్‌ఫాదర్ టీజర్ ఇంకా పోస్టర్‌లు జనాల్లో పెద్దగా బజ్ క్రియేట్ చేయడం లేదు. ఈ సినిమా పై కూడా పెద్దగా చర్చ జరగడం లేదు. ఇక థియేటర్లకు వెళ్లి సినిమా చూసే అభిమానులకు మాత్రం చిరంజీవి గాడ్‌ఫాదర్ చిత్రం ఒక కమర్షియల్ మూవీ అనే ఫీలింగ్‌ ఇస్తోందట.ఇప్పటి వరకు ఈ చిత్రంపై ఆశించిన స్థాయిలో టాక్ లేకపోవడంతో మెగాస్టార్ అప్‌సెట్ అయినట్లు ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఆచార్యే స్వయంగా రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. గాడ్‌ఫాదర్ చిత్రం ప్రమోట్ చేసేందుకు ఓ స్పెషల్ స్ట్రాటెజీ ఇంప్లిమెంట్ చేయాలంటూ తన టీమ్‌కు సూచించారట. ఆచార్య సినిమాకు ఏ స్థాయిలో అయితే ప్రమోషన్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారో గాడ్‌ఫాదర్ చిత్రానికి కూడా అదే స్థాయిలో ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారట. ఇందుకోసం బుల్లితెరను ఆయన మార్గంగా ఎంచుకున్నారు. టీవీలో వచ్చే పలు షోలలో చిరంజీవి పాల్గొనడం, లేదా ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ప్రిపేర్ అయ్యారట. చిన్న మీడియా పెద్ద మీడియా అనే తేడా లేకుండా అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి తద్వారా గాడ్ ఫాదర్ చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవాలని మెగాస్టార్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇదంతా ఇలా ఉంటే గాడ్‌ఫాదర్ చిత్రం దసరా స్పెషల్‌గా అక్టోబర్ 5వ తేదీ విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌‌ను గ్రాండ్‌గా చేద్దామని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలవాలని ఈ చిత్రబృందం డిసైడ్ అయ్యిందట.ఈ వార్త మెగా ఫ్యాన్స్‌కు ఒక పండగలా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు చిరంజీవి-సల్మాన్ ఖాన్ మధ్య ఓ మాస్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం.

ఆ క్రేజీ కాంబో మళ్లీ దుమ్ము రేపుతుందా..?

ఆ క్రేజీ కాంబో మళ్లీ దుమ్ము రేపుతుందా..?


అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ -బన్నీ కాంబోలో ఓ చిత్రం రాబోతోంది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో గతంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్‌ కోసం మరో కథ సిద్ధం చేసినట్లు ఫిలింనగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కొన్ని కమర్షియల్ యాడ్స్ కోసం బన్నీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ వీరి కాంబోలో వస్తుందని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగా తీపికబురే.

ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రంతో తనమునకలై ఉన్నాడు. అయితే 2023 ఏప్రిల్ నాటికల్లా మహేష్ బాబు చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారట త్రివిక్రమ్. ఇక ఆ తర్వాత సమయం వృథా చేయకుండా వెంటనే బన్నీ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయాలని భావిస్తున్నారట. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప ది రూల్ సినిమా అదే సమయానికి కంప్లీట్ చేసి త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ చేస్తారని ఫిలింనగర్‌లో వార్త షికారు చేస్తోంది. అంతా సవ్యంగా సాగితే 2023 చివరిలో గానీ... 2024 సంక్రాంతికి కానీ ఈ క్రేజీ కాంబోలోని క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

రష్మికా పై ట్రోల్స్ ఎందుకు..?

రష్మికా పై ట్రోల్స్ ఎందుకు..?

రష్మికా మందన్నా.. పుష్ప హిట్‌తో పాన్ ఇండియా యాక్ట్రెస్‌గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉంది. హిందీలో నటించిన గుడ్ బై చిత్రం ప్రమోషన్స్‌లో రష్మికా బిజీగా ఉంది. ముంబైలో గుడ్‌బై చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొని అక్కడ ప్రసిద్ధి గాంచిన లాల్‌బాగ్ గణపయ్యను దర్శించుకునేందుకు వెళ్లింది. అయితే అక్కడ రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆమెనునెటిజెన్లు ట్రోల్ కూడా చేస్తున్నారు.

లాల్‌బాగ్ గణపయ్యను దర్శించుకునేందుకు రష్మికా వచ్చింది.ఆ సమయంలో ఆమె ధరించిన ఔట్‌ఫిట్‌ సరిగ్గా లేదంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు రష్మికా నేషనల్ క్రష్‌ కావడంతో ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సమయంలో ఈ బ్యూటీ చాలా ఇబ్బంది పడింది. జనాల మధ్యలో నుంచి వెళ్లడంతో మాస్ మొలెస్టేషన్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొందరు నెటిజెన్లు తమ పోస్టులో రాసుకొచ్చారు. ఇక స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన రష్మిక సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఉంటే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఏదైతేనేం మొత్తానికి రష్మికా లాల్ బాగ్ గణపయ్యను దర్శించుకుని తన బాలీవుడ్ డెబ్యూ మూవీ గుడ్‌బై సూపర్ హిట్ కావాలని కోరుకుందట.

ఇక సినిమాల విషయానికొస్తే ఈ బ్యూటీ గుడ్‌బై చిత్రంలో నటించింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో బిగ్‌ బీ అమితాబ్ కూడా నటించారు.ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.మొత్తానికి పుష్ప పుణ్యామాని ఈ అమ్మడు ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక త్వరలో పుష్ప ది రూల్ సినిమాతో రష్మికా బిజీగా మారనుంది.ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న యానిమల్ అనే సినిమాలో రణబీర్ కపూర్ సరసన నటించేందుకు ఈ బెంగళూరు బ్యూటీ రష్మికా సైన్ చేసింది.

ఇవండీ ..ఈ రోజు అప్‌డేట్స్ .. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌ కోసం పేజ్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+